పుట:Dvipada-basavapuraanamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

బసవపురాణము

నని యసమానసమంచితార్థముల
వినయపూర్వకముగా వినుతి సేయుచును
నుండంగ, నఖిలనియోగంబు గొలువఁ
దండతండముల భక్తవ్రాజ మలర 230
గుడివడు గటమున్న కుంచియకోల
పొడసూప కేఁగినయెడఁ గిన్నరయ్య
దరహసితాస్యుఁడై తలుపులదిక్కు
నరగంట నొక్కింత యఱలేక చూడ
నఱిముఱి నటమున్న యప్పురాంతకుఁడు
వెఱచి తల్పులు వాఱఁదెఱచెఁ జోద్యముగ ;
“దాసికిఁ దెఱచె మున్ దలుపు లనంగ
నాసకలము నిందు మది గానఁ బడియెఁ ;
దనరుచుఁ ద్రిరాంతకునికవాటములు
గనుఁగొన నంతలోనన పాసి పడియె; 240
బాపురే ! కిన్నరబ్రహ్మయ్య యింక
నోపుఁబోఁ బలికింప నీపురాంతకుని"
ననుచుఁ జూపఱు గనుఁగొని ప్రస్తుతింపఁ
జనుదెంచి బ్రహ్మయ్య సంతోష మలర

—: కిన్నరబ్రహ్మయ్య పిలువ శివుఁ డో యని పల్కుట :—


“మనసిజక్రీడాంతమునఁ జెయివ్రేసి
వనితపాలిండ్లు నీ వని నిశ్చయించి
యడరఁగ నాతఁ 'డయ్యా !' యని పిలువ
నొడయనంబన్నకు నోయన్న శివుఁడ!
వెలయఁగ దాసమయ్యలవాదులోన
నిలఁ బిపీలీకయందుఁ బలికిన శివుఁడ : 250
మున్ను బాపూరిబ్రహ్మన్నకుఁ బలికి
జొన్నలు నీవ యై యున్న శంకరుఁడ !
పలుకవే నాబారిఁ బాఱి ” తన్నట్టు