పుట:Dvipada-basavapuraanamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

బసవపురాణము

భక్తియు సకలవిరక్తియు సహజ
భుక్తియు నభిమతభోగము ల్గలుగు *

—: మోళిగమారయ్య కథ :—


మఱియును మోళిగమారయ్య యనఁగఁ
గఱకంఠు సద్భక్తగణ విలాసంబు
ప్రచ్ఛన్నరుద్రుఁ డవిచ్ఛిన్నకీర్తి
స్వచ్ఛసదాచార సంపత్ప్రపూర్తి
విజితకామక్రోధవిమలమానసుఁడు
నిజగతి లింగైక్యనిష్ఠాపరుండు
మంగళచరితుఁడు లింగసందర్ధుఁ
డంగవికారదూరైకవర్తనుఁడు 350
సవిశేషజంగమార్చనపరతంత్రు
డవికలవిధిని షేధవివర్జితుండు
ప్రవిమలాంగుఁడు నిష్ప్రపంచగుణాడ్యుఁ
డవిరళతత్త్వానుభవసుఖాంభోధి
కర్మాపహరుఁడు లింగప్రాణమథన
మర్మజ్ఞుఁ డన లసన్మహిమఁ బెంపారి,
యనయంబు నతుల ఘోరాటవి కేఁగి
ఘనతరంబుగ మోచి కట్టెలు దెచ్చి
యంగడి విక్రయం బార్చి తెప్పించి
జంగమారాధన సలుపుచు నుండు; 360
రసరసాయనములు బసవని నగర
నసలాస భోగించి యాదటఁబోక
జంగమకోటి నిచ్చలు నొక్కమాటు
భంగిగా నారగింపఁగఁ బెట్ట వచ్చి
"బసవ ; మారని యట్టిభక్తులు గలరె ?
వసుధలో నీయింటిర సరసాయనము
లతనినగరఁ గాంచు నంబకళంబు