పుట:Dvipada-basavapuraanamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

బసవపురాణము

వలసినంతర్థంబు వ్యయమున కిత్తుఁ ; 110
జిన్న వోనిత్తునే చెలువలలోనఁ
జెన్నుగాఁ బండువు సేయు మీ" వనిన
“వేల్పుల కని మున్ను నిలిచినగొఱియఁ
బాల్పడి తేకున్నఁ బండువుసేయ
వెఱతుము సంపునో వేల్పు ద"మ్మనిన
నఱిముఱి 'నట్లగా' కనుచుఁ దత్ క్షణమ
కామాంధునకు నొక్క గార్యంబుఁ గాన
రామి దెల్లముగాన రయమున వచ్చి
గొఱియఁ బట్టుడుఁ దద్ద గోపించి చూచి
పరువడిఁ గిన్నర బ్రహ్మయ్య యెదిరి 120
“పట్టకుపట్టకు బసవరాజాన
పట్టినఁ దలఁ దెగఁగొట్టుదు నింక ;
[1]నంజుదురే శరణాగతవజ్ర
పంజరం బిదియె మా భక్తు లబిరుద"
మనుచు డగ్గఱుడు వాఁ డలుగు వెర్కినను
గినిసి రౌద్రో ద్రేకమునఁ బొంగి వ్రేసి
నిశితఖడ్గాయుధనిహతుఁ గావింపఁ
బశుపతిగుడి వెలిఁ బడియె శిరంబు
'బాస హీనునిబొంది వాడియే శివు ని
వాసంబునం దుండ దోస' మన్నట్టు, 130
లట్టయు నీడ్పించి యగ డ్త వై పించెఁ
గట్టలు గట్టి మూఁకలు సూచుచుండ,
నంత నావృత్తాంత మక్కర్మిబంధు
లెంతయు విని తమయిచ్చలో వగచి
తగువారుఁ దామును ధరణీశుఁ జేరి
వగచుచు నేడ్చుచు జగతీశు కనిరి :
‘‘త ప్పేమియును లేదు దమవాఁడు గొఱియ
చొప్పునఁ జని గుడిసొచ్చి పట్టుడును

  1. వెనుకాడుదురే.