పుట:Dvipada-basavapuraanamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

165

యీయయ్యసంపఁగఁనీఁడు వొ" మ్మనుచుఁ 80
బోవవచ్చిన "బొప్ప! పోవకు"మనుచు
వేవేగఁ దెప్పించి వేయుమాడలను
నిచ్చి “బొంకినఁ బోవనీఁజుమ్మురోరి :
యచ్చొత్తి విడుతు నే నటమీఁ దెఱుంగ"
ననవుడు 'నౌఁగాక ' యని మాడ లెన్ని
కొని లంజెయింటికిఁ జవిచని మగిడి
“గొఱియలేకున్నఁ బెద్దఱికమే?" యనుచు
మఱియొక్క గొఱియఁ గ్రమ్మఱవిల్చికొనుచు
బోయినఁ జొరనీక పొలఁతి గోపించి
“చా: యెట్టిమిండఁడ చనుసను మింక ; 90
సరివిటుల్ నవ్వంగఁ జక్క నాయిల్లు
చొర సిగ్గుగా దెట్లు శూన్యంపుగొల్ల !
చదివెదు వెక్కులు శ్లాఘ్యమే ? పసిఁడి
వెదవెట్టఁ బంతు నే వీథులనెల్ల ;
నిప్సిరో ! లంజెర్కమే యిట్లు నీకు
దుస్సి కట్టుదుగాక దొంతరలెల్ల
బ్రతుకంగనోపునే పడఁతి యీసారె
నెదిరి నేమనఁ జాలు నే లింకఁ బడుపు
బొజుఁగులు గొఱియలఁ బోకార్పఁగలరు ;
ప్రజలకుఁ దనకును బట్టుగ్రాసంబు 100
మజ ! బాపురే ! లంజె మనెడుఁ బొ మ్మనఁగ
గుజగుజలకు నెల్ల గుఱియైతి నింక :
నగుబాటు వట్రిల్లె నా తులలోన
మొగమెత్తనేర్తునే ? ము న్నెఱుఁగవొకొ !
యభిమానక త్తె దా నగుట నీ” వనుచు
నభిమాన మెడలంగ నతివ సల్కుడును
“బాయఁ జూపెనుఁబెనుఁబండువులందు
వేయేల గొఱియల వేయుమాడలకు
విలిపించి మఱి కదుపులభంగిఁ దెత్తు;