పుట:Dvipada-basavapuraanamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

167

భకుఁడు గిన్నర బ్రహ్మయ్య నాఁగ
శక్తిమంతుఁడుగాన చంపె" నావుడును 140
నుర్వీశ్వరుండు గోపోద్రేకవహ్ని
వర్వ ని ట్లని పల్కె బసవయ్యఁ జూచి.
“హరుభక్తు లధికదయాపరు లండ్రు ;
నిరపరాధులఁ జంప నీతియే మీకు ?
మనుజులఁ బ్రోలిలో మననీరు గాక
పనియేమి గొఱియలకును మీకుఁ జెపుఁడ
'మామీఁద నొకరాజు మఱి చెప్పఁగలఁడె ,
భూమిలో ' న న్నట్లు వొడిచి వై చెదరు ;
రాజులకు నిరపరాధులఁ జంపు
టోజయే! భక్తుల కుచితంబు గలదె ? 150
కాలఁ దన్నుట మాంసఖండంబు లిడుట
బాలునిఁ జంపుట ఱాలవై చుటయుఁ
గులములు సెడిపోయి కుడుచుట దండ్రి
తలఁ దెగఁగొట్టుట దన్వి నిచ్చుటయుఁ
దమ్ము దొరలఁ జాల ధర్మంబు లండ్రు;
ఎమ్మెయిఁ దగదండు రెదిరి దొరలిన
మీర యేలుదురు గా కీరాష్ట్రమెల్ల :
ధారుణి యేలంగఁ దమ కింకఁ బాసె ?
నప్పటి కప్పటి కది యేల వెఱవ
నొప్పుకో రాజ్యంబు ద ప్పేమి?” యనుఁడు 160
“గజ్జంబు మీఁదెఱుంగక పల్కుటెల్ల
బిజ్జలక్షోణీశ ! పెద్దఱికంబె ?
ధర్మము ల్కర్ములు దప్పుదు ; రెందు
ధర్మముల్ భక్తులు దప్పరు ; వినుము :
కిన్నరబ్రహ్మయ్య సన్నుతకీర్తి
పిన్నవాఁడే యూర కున్నను జంప ?
నట్టేల ? యె ద్దీనె ననుటయు గొందిఁ