పుట:Dvipada-basavapuraanamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

బసవపురాణము

కుటిలాత్ముఁ డై పుచ్చికొని నమలంగ,
నంతటిలోన నిమ్మవ్వ యే తెంచి
యంతంతఁ 'జీ ! కుక్క !' యని యిల్లు సొచ్చి 590
“పడుచు వాపముచేసె మృడునో గిరములు
దొడికిలి తినె శివద్రోహి వీ!" డనుచుఁ
బచ్చిచెక్కలఁ దలఁ బగులంగ నడిచి
చచ్చినపీనుఁగు జఱజఱ నీడ్చె
నన నేల ? పుత్త్రమోహంబు సీమంత
యును లేక కొడుకు చా వొరురెర్గకుండ
గాడిలోపల వైచి కసువు పై డిగిచి
వేడుక మదిఁ దులుకాడంగ మఱియుఁ
బాకయత్నము సేయ, బాలునిచావు
నేకాంతమున శివుఁ డెఱిఁగింపఁ దలఁచి 600
"చిఱుతొండ ! చూచితే : చిత్ర మివ్వనిత
తఱుసంటి యాఁకలి ధరియింపలేక
క్రమ మెర్గఁ డొకబూరె గ్రక్కున డిగిచి
నమలెనో నమలఁడో నాతి వీక్షించి
“పాకమింతయు వృథాపాకంబు సేసె
యీకుక్క ద్రోహి వీఁ డేల నా' కనుచు
నఱిముఱిఁ బట్టి నిజాత్మజుఁ జంపి
జఱజఱ నీడ్చి యాచక్కటి వై చె
నదె చూడు" మనుచుఁ బాదాంగుష్ఠమునను
బొదివిన కసువెల్ల బోవనూకుడును 610
జూచి శిరఃకంప మాచరించుచును
నాచిఱుతొండఁ డత్యాశ్చర్య మందె.
నంగన వాక ప్రయత్నాంతమందు
జంగమములకు మైజలకంబు సేసి
యతులలింగోపచర్యల నర్చ లిచ్చి
యతివ వడ్డించు నయ్యవసరంబునను