పుట:Dvipada-basavapuraanamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

153

గొనిపోయెఁ, గైలాసమున సిరియాలు,
డనుపమప్రమథగణాస్థానమందు
భవుఁ జూచి తనుఁ జూచి ప్రమథులఁ జూచి
భువిఁ దనపెట్టిన పుత్త్రునిఁ జూచి
“పుడమిఁ బుత్త్రునిఁ జంపి మృడునిచే మగుడఁ
బడసి కైలాస మేర్పడఁ జూఱ గొనిన
యిటువంటివాఁ డెవ్వఁడేఁ దొల్లి యిపుడు
నట యిట గలఁడె నాయట్టి భక్తుండు
ఏన కా” కని మది నెంతయుఁ గ్రొవ్వి
తా నహంకారించి తలఁపంగఁ దడవఁ 570
జిఱునవ్వు నవ్వుచు శివుఁ డది యెఱిఁగి
“చిఱుతొండ ర'మ్మని చెయివట్టికొనుచు
నిమ్మహీతలమున కేతెంచి యపుడ
క్రమ్మఱ నిమ్మవ్వకడ నిల్వఁబడుడుఁ --

—: నిమ్మవ్వ కథ :—


బడఁతియు బిట్టుల్కిపడి సంభ్రమమున
నడుగుల కెరఁగి పాదాబ్జముల్ గడిగి
యంగన ప్రచ్ఛన్నలింగమూర్తులకు
సాంగోచిత క్రియాభ్యర్చనల్ సేసి
పంచభక్ష్యంబులుఁ బాయసాన్నాదు
లంచితప్రీతిఁ గావించునయ్యెడను. 580
భువిఁ బథశ్రాంతులుఁబోలె సెట్టియును
శివుఁడును వెడ నిద్ర సేయుచున్నెడను
నిమ్మవ్వ యర్ఘ్యపణ్యమ్ముల కేఁగఁ
గ్రమ్మన గోవులఁ గాచి బాలుండు
నలసి యాఁకొని వచ్చి “యమ్మమ్మ!" యనుచు
దలుపుగఱ్ఱను నూకీ తల్లి లే కున్న
నటయిట వరికించి యం దొక్కబూరె