పుట:Dvipada-basavapuraanamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

113

నట్టిచో వెడల వపాంగోదకములు ;
నేఁడు నీకడకంట నిర్నిమిత్తంబ
పోఁడిగా జలములు పూరించు టేమి?
ఆలుబిడ్డలఁ బాసి యడవుల గిరుల
పా లైతి నని దుఃఖపడి యేడిచెదవొ ? 1000
యేకాకి నైతి నిం కేక్రియఁ బ్రోతు
లోకంబు లని ధృతిలేక యేడ్చెదవొ ?
కడుపు గాలంగ నాఁకటి కోర్వలేక
తడ వయ్యె రాఁ డని తలఁచి యేడ్చెదవొ ?
యక్కడ దండిమృగాలిచే నాదు
చిక్కుట నూహించి నిక్క మేడ్చెదవొ ?
పనిపాటు సేయనోపక యొంటివిడిచి
చనియెనో తమపల్లె కనుచు నేడ్చెదవొ ?
అఱిముఱి నొకపువ్వు మఱి మూరుకొన్న
నెఱయఁ బ్రాణమునకు వెఱచి యేడ్చెదవొ ? 1010
కారణం బేమి ? గన్గంటఁ బుట్టెండు
నీరు గాఱఁగ నేడ్వ నీ కేమీ నలసె ?
చెప్పవే నా” కని చేర్చుఁ గౌఁగిటను
నప్పళింపుచును 'నాయట్టి పుత్త్రుండు
గలుగ నీ కేల యప్పుల బ్రుంగ' ననిన
పొలుపునఁ గంటియప్పులు వాఱఁ దుడిచి,
“పాసియుఁ బాయదు వ్యాసంగ" మనుచు
నీసరిలింగముల్ నిను నగరయ్య !
ఊరకో నాయన్న ! యూరకో తండ్రి !
యూరకో నాస్వామి ! యూరకిం తేల ? 1020
యుమ్మలికము తగ దుడుగవే' యనుచు
ఱొమ్మున నేత్రోదకమ్ముల ట్లొత్తు ;
“నెసఁగ నాముగ్ధత కీకంటిలోని
కసువ పొ' మ్మన్నట్లు గన్ను శోధించుఁ :