పుట:Dvipada-basavapuraanamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

87

మహితలంబితరత్న మాలికానిచయ
బహుమణిదీపవిభ్రమకాంతి పర్వ 250
మించి వెల్గెడుపట్టెమంచంబు పుష్ప
సంచితం బగు నండజముపాన్పు దనర
వివిధసౌరభసుఖాన్విత మగుమంద
పవనంబు జాలకపంక్తిఁ దన్పార
శ్రీరుద్రవరదివ్య సింహాసనంబొ ?
గౌరీమనోహరు చారుపుష్పకమొ?
గంగావతంసుని శృంగార గృహమొ ?
యంగజవిజయుని యనుఁగుమంటపమొ?
యన నతిరమణీయ మగు సజ్జపట్టుఁ
గని, మిండఁ డద్భుతాక్రాంతాత్ముఁ డగుచు 260
నదియును నాతి లింగార్చనసేయు
సదనంబుగాఁ దనమదిలోనఁ దలఁచి,
యుత్తుంగసింహాసనోపమం బైన
యత్తన్విచారు పర్యంకంబు దిగువ
నవనిపైఁగంబళి యాసనంబుగను
శివసమారాధన సేయఁ గూర్చుండి.
భూతి సర్వాంగముల్ పూయుచో నతఁడు
“భూతిపూయ వదేమి వొలఁతి నీ"వనిన-
“నిచ్చఁ బార్వతి పూయుపచ్చవిభూతి
యిచ్చె నొక్కయ్య నా కీమునిమాపు 270
పూసితి సర్వాంగములఁ జూడు" మనుచు
భాసురం బగు మేనిపసుపుఁ జూపుడును ;
వలయుచో రుద్రాక్షములు ధరింపుచును
“ లలన : రుద్రాక్షముల్ దాల్పవే” మనినఁ-
“గడుఁ గందు లవణసాగరతీరమునను
బొడమిన రుద్రాక్షములు సహింపమిని
దెల్లంబు క్షీరాబ్దితీరమం దుండు