పుట:Dvipada-basavapuraanamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

బసవపురాణము

మది నిశ్చయించి సమ్మదము దుల్కాడఁ 220
గల నైన లంజెఱికం బనునట్టి
పలు కెఱుంగమిఁ జేసి బసవయ్యఁ జూచి
“యేనును బోదునా యీయయ్యగాండ్ర
తోన లంజెఱికంబు మానుగాఁ జేయ?"
ననవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁ డగుచుఁ
“జను జియ్య ! నాముగ్ధసంగయ్యదేవ :
యని గారవింపుచు నాయయ్య కపుడుఁ
గనుఁగొన సహజశృంగారంబు సేసి
పరిచారకులఁ బిల్చి పటుభ క్తి గల్గు
తరుణియింటికిఁ బంపఁ-దత్సతిఁ జూచి 230
“గణుతింపఁ బ్రమథలోకంబుకన్యకయొ ?
గణిక సాక్షాద్రుద్రగణికయో? తలఁపఁ
జిత్తరురూపమో ? చెలువయో పసిఁడి
పుత్తడియో ! " నాఁగఁబొలఁతి యేతెంచి,
ముగ్ధమిండనిపాదములమీఁద బడి. వి
దగ్ధ మిండెత సముద్యద్భక్తి మెఱసి,
పడిగంబు వెట్టించి పాదముల్ గడిగి,
కడువేడ్కఁ బాదోదకంబు సేవించి,
ప్రీతి యెలర్ప విభూతివీడియము
లాతన్వి దాన సమర్పణ సేసి, 240
యనుపవచ్చినవార లరుగ మిండనికిఁ
దనహస్త మిచ్చి తోడ్కొని పోవునెడను
స్ఫాటికసోపానపంక్తి నొప్పారు
హాటకకుట్టిమహర్మ్యస్థలమునఁ
గలయంగఁ గస్తూరికలయంపి మీఁద
వెలుఁగు ముక్తాఫలంబులమ్రుగ్గు లమరఁ
గంభకట్లను మేలుకట్లను బొలుచు
గంభీరపుష్ఫకాగారంబునందు