పుట:Dvipada-basavapuraanamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

బసవపురాణము

తెల్లరుద్రాక్షముల్ దెచ్చె నొక్కయ్య
యెప్పుడుఁ దాల్ప నున్పెక్కిన” వనుచు
నప్పొల్తి ముత్యాలహారముల్ సూప 280
నక్కజుం డగుచు ముత్యాలసూసకము
ముక్కునఁ దాల్చిన ముత్యంబుఁ జూచి
“యుత్తమాంగంబున నువిద ! రుద్రాక్ష
లుత్తమం బయ్యెఁ బో క్రొత్త మా కిదియు :
నెక్కడ వినఁబడ దిట్లు రుద్రాక్ష
ముక్కునఁ దాల్చిన ముఖ్యమే ?” మనిన
“దేవ ! యేమని చెప్ప ! దేవుఁడే యెఱుఁగు
నావిశేషంబు వేదాతీత" మనుఁడు ;
నురుజటావలి విచ్చి యొత్తిచుట్టుచును
“దరళాక్షి : జడలేల తాల్ప వీ" ననిన... 290
“సగముప్రసాదపుష్పములకు నునిచి
సగమునఁ దాల్చితి సన్నంపుజడలు ;
సన్నుతతద్భస్మసమ్మిశ్ర మగుచు
వెన్నున నిదె చూడు వ్రే లెడి " ననుచు
పటుగళాభరణసంఘటితి మై యొప్పు
పటవలికుచ్చులు వడఁతి సూపుడును-
“భువి నిట్టిభక్తురాలవు గచ్చడంబు
ధవళాక్షి : మఱి యేల తాల్ప వీ"వనిన-
లింగవంతులు గాని లెంగుల దృష్టి
భంగిగా నాపయిఁ బాఱకయుండఁ 300
గట్టితి సర్వాంగకచ్చడం" బనుచుఁ
గట్టిన సమకట్టుఁ గాంత సూపుడును
వనిత యపూర్వలాంఛనధారి గాఁగ
మనమునఁ దలపోసి మహిఁ జాఁగి మ్రొక్కి,
“యిట్టిలాంఛనమున కెవ్వ రాచార్యు ?
లెట్టివి నియమంబు ? లెట్టిది సర్య ?