పుట:Dvipada-basavapuraanamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

బసవపురాణము

భర్గ ! నీప్రమథుల భక్తులయిండ్ల
నలరుచు డించిన యాప్రసాదంబె
కలదు భోగింపగాఁ గలకాల మెల్ల ;
సర్వభక్తాత్మ : మీజలకంబువాఁడు
గుర్వుగా మాకాటకోటయ్యగారు : 530
హర : మీనగరిమాలకరి పుష్పదంతుఁ ;
డరిదిపూజారి కన్నప్పదేవయ్య ;
యిండెగట్టెడిది మా యిండెరేకవ్వ ;
ఖండదీపమువాఁడుగా నమినంది ;
నెట్టణ దీవించి నీకు విభూతిఁ
బెట్టెడువాఁడు మాపిళ్లనై నారు :
అనుషక్తిమై గంధ మర్పించువాఁడు
మనసిజసంహర ! మాయణుమూర్తి ;
వరద ! మీధూపంబువాఁడు మాచయ్య ;
వరకీర్తి : మీగంటవాఁ డోహిళయ్య : 540
ధర మంగళారతుల్ దరిసించువాఁడు
వరద ! సోమయగారు శరణవత్సలుఁడు ;
వంటకట్టెలు దెచ్చువాఁడు మారయ్య ;
పంటింపఁ గరికాలు పడివెట్టువాఁడు :
కటకంఠ ! [1]యడబాల సిఱుతొండనంబి ;
మఱి బానసమునది మాసంగళవ్వ ;
కరికాలచోడు పళ్లెర మిడువాఁడు ;
గరగ కావటివాఁడు ఘనుఁడు హొన్నయ్య
రమణీయ మగు నోగిరంబుల పరిసె
నమువాఁడు సెన్నయ్య విమలదేహుండ ! 550
యారగింపఁగఁ బెట్టునవసరంబులది
వీరచోడవగారు విశ్వైకవినుత :
అడపంబువాఁడు రేచయ మునుపాలు

  1. వంటవాడు.