పుట:Dvipada-basavapuraanamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67

పడుప్రసాదులు బిబ్బబాచయ్యగారు ;
మృడుఁడ! మానాట్యనమిత్తండి వైద్యుఁ ;
డడరంగఁ గల్లి దేవయ్య : [1]వెండీఁడు ;
మలహర ! సామవేదులు పురోహితులు ;
వెలయఁ బౌరాణికుం డిల మాయిభట్టు ;
కోరి మీపరిహాసకులు గళియంబ
గారు ; నాగీశ నైనారు పాఠకుఁడు;
శ్రీపతిపండితుల్ శివుఁడ : మీ కవులు ; 560
నాపండితయ్యగా రనుఁగుఁబండితులు ;
నాదివీణెలవాఁడు మాదిరాజయ్య ;
నాదరసజ్ఞుఁడు నలి శంకరయ్య ;
కరణంబు గర్మసంహర ! కేశిరాజు ;
ధర జగదేవుండు దండనాయకుఁడు;
గణనాథుఁ డిందుశేఖర : మీ ప్రధాని ;
ప్రణుతించి చూడ మాప్రభువు మీప్రభువు
ఇఱవత్తుఁడు గజసాహిణి యశ్వసాహి
యొఱపుగాఁ జేరమ యోగియొడయఁడు :570
అనఘ ! రామయ్య యేకాంతంబువాఁడు ;
నొనర బల్లహుఁడు గుంటెన, సఖి నంబి ;
శంకర! నీబంటు శంకరదాసి :
యంకంబువాఁడు నేణాధినాథుండు;
లెంక దా మంచయ్య లీల మీనగరి ;
[2]సుంకీఁడు నుంకేశుబంకయ్యగారు ;
సురియఁ బట్టెడువాఁడు సురియచౌడయ్య :
పొరిఁ గులచ్చిరియారు భువి [3] హేళగీఁడు ;
హర ! నీకు బెజ్జమహాదేవి దాది ;
ధర రుద్రపశుపతి దా మంత్రవాది : 580

  1. బొమ్మలాడించువాఁడు.
  2. సుంకము (పన్ను) వసూలుచేయువాఁడు.
  3. కథలు చెప్పువాడు.