పుట:Dvipada-basavapuraanamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65

యెసఁగు జొన్నలప్రోఁక యిందఱుఁ జూడఁ
బొనరుచు ముత్యాల ప్రోఁకయై తనరె,”
నని భక్తమండలి వినుతింపుచుండఁ 500

—: సంగమేశ్వరుఁడు బసవని మూఁడవ కన్నడుగు కథ :—


జెచ్చెర మఱియు నీప్సితవస్తువితతి
నెచ్చుగా బసవఁ డి ట్లిచ్చుటఁ జూచి
“వేడు కయ్యెడు నాకు వేఁడంగ" ననుచు
రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి
చక్కన సంగమేశ్వరుఁడ యేతెంచి,
గ్రక్కున మూఁడవక న్నడ్గఁ దడవ
నాయతలింగ పసాయితహస్తుఁ
డై “యెఱుఁగనె నీదుమాయ నే" ననుచు
ముకురంబుఁజూపుచు “ముక్కన్ను నీకు
నకలంక ! సహజంబ యదెచూడు" మనిన 510
నద్దంబులోన ఫాలాక్షంబుఁ గాంచి
యద్దేవదేవుండు దద్ద జ్జించి
యప్పు డక్కడన నిరాకార మగుడుఁ
జప్పరింపుచుఁ జూచి "చా! పంద ! పంద !
యోడకు మోడకు మోరోరి ! సంగ!
యోడకు మోడకు మొకటియు నొల్ల
నెఱుఁగవే సత్యమాహేశ్వరులిండ్ల
నెఱయంకకానిని నిజగతి నన్ను
దాసయ్యవలె నిన్నుఁ దవనిధి వేఁడ;
నా సిరియాలున ట్లాత్మజుఁ గోరఁ ; 520
గనకవృష్టి యడుగఁ గరికాలునట్ల ;
వనితకు నెడపుచ్చు మన నంబిభాతి
వెండియుఁ గుమ్మరగుండయ్య కిచ్చు
మిండప్రాయంబుఁ గామింపఁ ; గాదేని
స్వర్గాపవర్గాది సౌఖ్యంటు లొల్ల