పుట:Dvipada-basavapuraanamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

61

బుట్టినయట్టుగాఁ బుట్టితి కొడుక !
నెట్టణ భక్తికి నిలుకడ యగుచు*
బసవయ్య : బసవన్న ! బసవకూమార !
బసవ ! బసవరాజ ! బసవలింగంబ ! 390
వడిఁ బాఱుజలమున కొడలెల్ల గాళ్లు :
వడిఁ గాలుచిచ్చున కొడలెల్ల నోళ్లు :
వడి వీచుగాడ్పున కొడలెల్లఁ దలలు :
వడిఁ జేయుబసవ ! నీ కొడలెల్ల భక్తి !
'బసవా' యనఁగ విన్నఁ బాన లొం డేల ?
పసులకు నై నను బ్రబలదే భక్తి :
“బసవా ' యనఁగ విన్నఁ బాన లొం డేల ?
పసిబాలురకు నైన నెసఁగదే భక్తి !
“బసవా" యనఁగ విన్నఁ బాన లొం డేల ?
యసమాక్షునకు నైన నలరదే భక్తి ! * 400
లింగైక్యసౌఖ్య కేళీలోలభక్తి
జంగమప్రాణానుసంధానశక్తి
యుభయప్రసాదసంయోగోపభుక్తి
త్రిభువనంబుల నున్న దే యితరులకు ?"
నని పెక్కు భంగుల నగ్గింపుచుండ
ననుషక్తి నా బసవనకుమారుండు
మిక్కిలిసద్భక్తి మిక్కుటంబుగను
మ్రొక్కుచు నందంద మోర్పుఁగే లమర
"భక్తవత్సల : పరాపర ! పరమాత్మ !
ముక్తివల్లభ ! దివ్యమూర్తి : సర్వజ్ఞ ! 410
ప్రభువ ! జంగమలింగ ! ప్రమథాగ్రగణ్య !
ప్రభువ ! సంగయదేవ ! పరమానురాగ !
కారుణ్యనిధి ! సమగ్రత సూపి నీకు
నారగింపఁగఁ బుట్టునంత భక్తుఁడనె ?*
అట్టిపార్వతియు ము న్నారగింపంగఁ