పుట:Dvipada-basavapuraanamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

బసవపురాణము

లింగతూర్యములు సెలంగ నుప్పొంగి
మంగళారతు లెత్తె ; మహిఁ దత్క్షణంబ 360

—: అల్లమప్రభునికి విందుపెట్టుట :—


పళ్లెరం బిడి, పంచభక్ష్యాన్నములును
నెల్ల పదార్థముల్ మొల్లంబు గాఁగ
వడ్డించి, యబ్బసవం డర్థి దొడ్డ
దొడ్డకళ్లుగఁ జేసి తొడిఁదొడిఁ బట్టి
హరునకు దొల్లి యా సురియచౌడరసు
కరమర్ధి నందిచ్చుకరణియుఁ బోలె
నందిచ్చుచుండంగ నర్థిఁ జేసేత
నందికొంచును త్రిభు వారగింపంగఁ
బంబి లక్షయు నెనుబదివేలు జంగ
మంబుల కనుచు సమగ్రత దనర 370
నటమున్న చేసినయప్పదార్థంబు
లిటుగూడ సమయుడు నెట్లొకో యనక
యేనకా కోగిరం బింక నీ కనుచుఁ
బూని యూఁకింపఁ బ్రభువు మెచ్చి యంతఁ
"గో"యని భక్తనికాయంబు వొగడ
"హో" యని సత్కృపాయుక్తి వొల్పార
“బాపురే ! బసవ ! సద్భక్త సంత్రాణ :
బాపురే ! బసవ : సద్భక్తి ధురీణ !
నల్ల వో ! బసవ ! యనశ్వరకీర్తి !
నల్లవో : బసవన్న : నందీశమూర్తి ! 380
అమృతంబునందు దివ్యం బగుచేగ
విమలమాణిక్యగర్భమున దీపంబు
చెఱకునఁ బండు వసిఁడిఁ గమ్మఁదనము
గొఱయైనమలయజకుజమునఁ బూవు
చిత్తరువునకును జీవంబుఁ బసిఁడి
పుత్తళికిని బ్రాణమును నిక్కువముగఁ