పుట:Dvipada-basavapuraanamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59

నిది దె ర్వడవి యని మదిఁ దలం పుడిగి 330
యరుదేర-నన్నియు నంతంతఁ దొలఁగి
తెరు విచ్చుటకు నరు లరు దని పొగడ
బసవని యసమవిభ్రాజితభక్తి
రసవార్ధి వెల్లి విరిసి నిట్టవొడువ
వచ్చెఁ దద్వీచి ప్రవర్తితం బగుచు
వచ్చువహిత్రంబువడువును బోలె ;
నిచ్చ రత్నపరీక్ష యెఱిఁగి చేపట్టు
బచ్చునుబోలె నబ్బసవయ్య ప్రభువు
భావంబు సంగయ దేవునియంద
భావనఁ బొరయుడు భక్తి మై మ్రొక్క 340
రుచిరరత్న ప్రభానిచిత మై యున్న
యచలితస్వర్ణసింహాసనం బెక్కి
ప్రభు వున్న, నంగ ప్రభాపటలంబు
లభినుతిఁ బొందె దిశాంతరాళముల;
నొడల జీవము గల్గియును లేనివాని
నడగల్గియును వర్తనము లేనివానిఁ
గన్నులు వ్రేఁగులుగాఁ గలవాని
మున్ను లింగమ ప్రాణముగ నున్నవానిఁ
జేతనుం డయ్యు నిశ్చేష్టలవాని
ఖ్యాతి లేకయు నుతిఁ గడచన్న వానిఁ 350
బలుకుల మీఱిన బాసలవానిఁ
దలఁపుదలదాఁటిన తత్త్వంబువాని
గుణహీనుఁ డయ్యును గుణమిచ్చువానిఁ
బ్రణవాత్ముఁ డయ్యు నేర్పడియుండువానిఁ
గని, శర ణనుచు గగ్గదకంఠుఁ డగుచుఁ
గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
బసవఁ డల్లంతటఁ బ్రణమితుం డగుచు
నసలార సముచితాభ్యర్చితుఁ జేసి