పుట:Dvipada-basavapuraanamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

బసవపురాణము

బెట్టఁ జాలదు విందు విన్నపాపనికి *
సర్వకల్యాణ ! సంసార విదూర !
సర్వజ్ఞ ! జియ్య! సాక్షాత్సంగమేశ !
నెట్టణ నిష్ఠించి నీ కారగింపఁ
బెట్ట నాశక్యమే ? పృథుదయా భావ ! 420

—: అల్లమప్రభువు బసవనికి వరము లిచ్చుట :—


యనుచుఁ బ్రశంసింప నల్లమ మెచ్చి
వినుత దయామృతవనధి నోలార్చి,
"సురభి చింతామణి సురభూరుహములు
పరపు లైయుండంగ వరమీగి యెంత
పెద్ద నా” కనుచు సంప్రీతి సిత్తమునఁ
దద్ద సంధిలఁ బ్రసాదము గృపసేసి,
తలఁచిన పదపదార్థములు సేకూడ
వలె నన్న వస్తువు లిలఁ దాన పొందఁ
బలికిస బాసయుఁ బాటియై తనర
నిలిచినమార్గంబు నిలుకడ గాఁగఁ 430
బట్టినపద డైన బసిఁడియై వెలుఁగ
ముట్టినబయలైన మూర్తి సేకొనఁగఁ
దెఱలినశివు నైన వెఱవక గెలువఁ
దఱిమినజంగమధట్టన కోర్వఁ
జాలు నక్షయలింగసంపద లిచ్చి
లీలఁ దత్త్వార్థసమ్మేళనం బొలయ
మోహమాయాదిత మోరాశిఁ ద్రుంచి
దేహేంద్రియాది విద్వేషం బడంచి
మున్ను దత్త్వస్థితిఁ దన్నుఁ దానెఱిఁగి
తన్నును సత్క్రియోదాత్తతఁగూర్చి 440
లీన మై ప్రాణంబు లింగమం దొలయఁ
గా నాథుఁ డాప్రాణాలీన మై యుండఁ
గా నిరంతరపరమానందసుఖము