పుట:Dvipada-basavapuraanamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

బసవపురాణము

వికృతాంగ : శ్రీగురువే నమో " యనుచు
“నాద్యంతరహితనిత్యామలతేజ !
విద్యాత్మ ! శ్రీగురవే నమో " యనుచు
నధ్వషట్కాతీత ! యతిపాతకౌఘ
విధ్వంస ! శ్రీగురవే నమో" యనుచు
"మోక్షార్థిరక్షణదక్షకటాక్ష
వీక్షణ : శ్రీగురవే నమో" యనుచు
“నజ్ఞానతిమిర సంహారార్థదత్త
విజ్ఞాన : శ్రీగురువే నమో” యనుచు 310
““ధన్యాత్మశిష్యమస్తకకృపాహస్త
విన్యాస ! శ్రీగురవే నమో" యనుచు
సఘహరణార్థశిష్యజనోపభుక్త
విఘనస ! శ్రీ గురవే నమో" యనుచు
నశ్రాంతభక్తజనాత్మాంబుజాత
విశ్రాంత ! శ్రీగురవే నమో" యనుచు
ననఘ గురుప్రసాదామృతహృదయ
వినివాస ! శ్రీ గురవే నమో" యనుచు
భ్రాజిల్ల నాచెన్నబసపఁ డబ్బసవ
రాజును దనగురుఁ బ్రస్తుతి సేయ - 320

—: అల్లమ ప్రభుని రాక :—


నంత నల్లమప్రభు వనుసంయమీశుఁ
డంతకాంతకమూర్తి, యతులితకీర్తి.*
ద్వైతయోగ క్రియాద్వైతయోగక్రి
యాతీత యోగక్రియాన్వీతుఁ డనఁగ
ముల్లోకములఁ దేటతెల్ల యై, భక్తి
కెల్ల యై, స్వేచ్ఛావిహీనకృత్యమున
లీలఁ గరస్థలలింగవిన్యస్త
లోలేక్షణానందకేళిఁ ద న్మఱచి
యిది యేఱు వల్లంబు నిది సెట్టు గట్టు