పుట:Dvipada-basavapuraanamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57

పటుతరంబుగఁ డెన్నబసవఁడై పేర్చె :
భవ్యలింగమున కేర్పడఁ బ్రాణ మగుచు
నవ్యప్రసాదంబునకు రుచి యగుచు
జంగమభక్తి కాశ్రయపదం బగుచు
మంగళప్రాప్తికి మందిరం బగుచు
గుఱిగా కవాఙ్మనో గోచరం బగుచు
వఱలెడు శివతత్త్వవల్లభుమహిమ 280
బిలిబిలితలఁపులవలన వర్తిల్లి
మొలచిన తమతమకొలఁదిమాటలను
వినుతించుటెల్లను వెలితియ కాదె
పనుగొస నాచెన్నబసవన్న నెలవు !
కావున బసవండె గణుతింప నెఱుఁగు
భావింప నాచెన్నబసవన్నమహిమ. ;
బసవనిమహిమయు భాతిగాఁ జెన్న
బసవండె యెఱుఁగుఁ బెంపెసఁగఁ గుర్తింప ;
నంచు భక్తానీక మచ్చెరువంద
నంచితభక్తిసమగ్రత మెఱసి, 290

—: చెన్నబసవన బసవేశ్వరుని స్తుతించుట :—


“శాశ్వత! సర్వజ్ఞ : శశ్వద్గుణాంక !
విశ్వేశ ! శ్రీగురవే నమో" యనుచు
సద్యః ప్రసన్నానవద్యవేదాంత
వేద్యాత్మ: శ్రీగురవే నమో" యనుచు
“దత్తకైవల్య : యుదాత్తసద్భక్తి
విత్తేశ ! శ్రీగురవే నమో" యనుచు
“నమిత పరంజ్యోతిరాకార దివ్య
విమలాంగ ! శ్రీగురవే నమో" యనుచు
"స్థిరతరసృష్టిస్థితిలయప్రపంచ
విరహిత | శ్రీగురవే నమో " యనుచు 300
“సకళ నిష్కళ చరాచరరూపవిగత