ఈ పుటను అచ్చుదిద్దలేదు
క॥
“అయ్యువతీరమణులకును
నయ్యల మంత్రీంద్రుఁ డుదితుఁడై ధారుణిలో
నెయ్వెడ నర్థార్థులు మా
యయ్య యని పొగడఁగ నెగడె సౌదార్యమునన్.
సీ॥
ఆత్రేయ గోత్రపవిత్ర పేరయమంత్రి
పుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహమై వేఁగి దేశంబులో
నేపారు రాజమహేంద్ర పురికి
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు
మంత్రియై రాజ్యసంపదఁ బొదలి
యొప్పారు గౌతమి యుత్తర తటమున
మహనీయమగు పెద్దమడికి యందు
స్థిరత రారామతతులు సుక్షేత్రములును
బెక్కులార్చించి సితకీర్తి బెంపు మిగిలి
యఖిలజగదన్నదాతనా నవనిఁ బరఁగె
మధుర గుణధుర్యఁ డయ్యల మంత్రివరుఁడు
చ॥
ఒనరఁగఁ దద్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాత్రుని నారయాహ్యయున్
గని నరసింహ నామములు గారవ మారఁగఁ బెట్టిరందఱున్.
క॥
వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా