| మంగళమహాశ్రీ. | “ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరఁగు శార్వరిని బుణ్య | |
(కర = 2 యుగ = 4 అనల = 3 మృగాంక = 1 అంకానాం వామతోగతిః. కాబట్టి శాలివాహనశకము 1342. హూణశకము 1420 శార్వరి సంవత్సరమున మార్గశీర్ష శుద్ధ పంచమీ బుధవారమునాఁడు పద్మపురాణము ముగింపఁబడెను.)
దీనిని బట్టి పర్యాలోచించి చూచిన మడికి సింగనార్యుఁడు ప్రౌఢావస్థ యందున్న సమయమందు పోతనార్యుని భోగినీదండకము పుట్టినదని నిర్ణయించుటకు వీలున్నది. అప్పటికింకను పోతనార్యుఁడు భాగవతమును దెనిఁగించుటకుఁ బూనుకొని యుండలేదు.
“వాసిష్ఠ రామాయణము పద్మపురాణమునకుఁ దరువాత రచయింపఁబడిన దగుటచే నది 1420కిఁ దరువాతఁ జేయఁబడినది. ఈ రెండుకావ్యములకు నడుమ సింగన్న భాగవత దశమస్కంధమునుఁ గూడఁ దెనిఁగించి కందనామాత్యునికే అంకిత మొనరించెను. సింగన కృత భాగవత దశమస్కంధము నాకు లభింపలేదు. అటుతరువాత నీకవి సకలనీతిసమ్మత మను నీతిగ్రంథమును సమకూర్చె నని రామకృష్ణ కవిగారు చెప్పుచున్నారు.