ఈ పుట ఆమోదించబడ్డది
ప్రతి గ్రంథమును శ్రమను బాటించక శ్రద్ధగావ్రాసి యిచ్చిన లైబ్రరీ తెనుఁగు లేఖకుఁడు చిరంజీవి యన్. విశ్వనాథునకు నా యాశీర్వాదపూర్వకమైన ధన్యవాదములు. ఈ చిన్న పొత్తమును సకాలమందు తగు విధముగా ముద్రణ చేసిన “ఆముద నిలయం” ముద్రణాలయమువారికి నా ధన్యవాదములను సమర్పించుకొనుచున్నాను.
ఈ యుపోద్ఘాతారంభము మా కులమునకు పరమగురువు లగు శ్రీరమణమహర్షులవారికి నమస్కృతులతో ప్రారంభించినది. నాజనకులును, గురువును దైవమునగు శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి మునులవారిని స్మరించుటతోపాటు శ్రీకృష్ణ భగవానుని పై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్ఘాతమును ముగించుచున్నాను.
| శ్లో॥ | భూమిభార వారణాయ యోయదుష్వభూ ద్విభు | |
సరస్వతీమహల్ లైబ్రరీ
తంజావూరు. 7-12-50
వాసిష్ఠ. ఆ. మహాదేవశాస్త్రి.