పుట:Dvipada-Bagavathamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • వచనకావ్యములు
  • శాస్త్రసాహిత్యము
  • వివిధగ్రంథములు.
  • మద్రాసు ప్రభుత్వమువారు స్వతంత్రమును బొందిన హిందూదేశ పురోభివృద్ధికి విజ్ఞానము ప్రధానాంశముగా గమనించి పై లైబ్రరీలోని తెనుఁగు శాఖకు సంబంధించిన పుస్తకములను గొన్నింటిని బ్రచురించి, ఆంధ్రసాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు పూనుకొని యున్నారు. ఈ విషయమందు మద్రాసు ప్రభుత్వము వారు చూపిన శ్రద్ధకు ఆంధ్రలోకము మనఃపూర్వకమైన ధన్యవాదములు సమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న సేవను జేయు సందర్భమును నాకిచ్చి భాగవత దశమస్కంధము యొక్క పరిష్కరణ భారమును నాకొసంగిన సరస్వతీమహల్ లైబ్రరీ గౌరవకార్యదర్శి శ్రీయుతులు యన్. గోపాలన్ బి. ఎ., బి. ల్. గారికి నా కృతజ్ఞతాభివందనములను సమర్పించుకొనుచున్నాను.

    మా సరస్వతీమహల్ లైబ్రరీ విమర్శనశాఖా నిర్వాహకులును, బహుగ్రంథ ద్రష్టలును, సర్వతోముఖ పాండిత్యమును గల శ్రీయుతులు కె. వాసుదేవశాస్త్రిగారు నా కన్నివిధములుగా ప్రోత్సాహము నొసంగి నాయుద్యమము కొనసాగుటకు సహాయ మొనరించిరి. వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించుకొనుచున్నాను.

    నాకన్ని విధములనుఁ జేదోడు వాదోడుగానుండి సహాయ మొనర్చిన మన్మిత్రులు శ్రీయుతులు విఠలదేవుని సుందరశర్మగారికి నా కృతజ్ఞతాభివందనములను నివేదించు కొనుచున్నాను. తాళపత్ర