ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఉపోద్ఘాతానుబంధము.
———
క్రీ. శ. 1948వ వత్సరమునందు జరిగిన భాగవత ముద్రణమునకు విద్యారత్న శ్రీ నిడదవోలు వెంకటరావుగారు M. A. (Senior Lecturer and the Head of the Telugu Department, Madras University.) వ్రాసిన పీఠికలో “భాగవతానువాదములు” అను శీర్షికలో నదహరింపఁబడిన ద్విపదభాగవతముల పట్టిక నీక్రింద నుదహరించుచున్నాను. చిత్తగింపుడు.
- పండ్రెండు స్కంధములు (సంపూర్ణము) – తరిగొండ వెంగమాంబ (అముద్రి)
- మొదటినాలుగు స్కంధములు — తేకుమళ్ళ రంగసాయి (అము)
- దశమస్కంధము (ప్రస్తుత పరిష్కరణము)—మడికి సింగన.
- దశమస్కంధము. రత్నాకరము గోపాలకృష్ణకవి (అము)
- రుక్మిణీకల్యాణము —చెన్నయ (అము)
పరిష్కర్త
ద్వి॥ భా॥