ఈ పుటను అచ్చుదిద్దలేదు
డీమంత్రి కులచంద్రు నేమంత్రి వురణించు
నామంత్రి విముఖాత్ముఁడఖిలమునకు
ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
ముల నుతింప నొప్పు ముజ్జగములఁ
దారహారహీరధవళాంశుసమకీర్తి
కలితుఁ డౌబళ కందవిభుఁడు.
కందన మంత్రికిఁ దాతకుఁ దాతయైన గన్నయ మంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండినట్లు పద్మపురాణములోని యీక్రింది పద్యము చెప్పుచున్నది.
చ॥ “పరువడిఁ గాకతీయ గణపతి నాయకు నొద్ద మాన్యుఁడై
ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం
పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపున్
దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వమేర్పడన్”.
కృతిపతి కందామాత్యుని వంశవృక్షము నిచ్చుచున్నాను. గన్నయమంత్రి ! ! మల్లన ! ! గణపతి ! ! అప్పయామాత్యుఁడు (ద్వితీయ పుత్రుఁడు) ! ! కందనమంత్రి (మూఁడవ కుమారుఁడు కృతిభర్త)