Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

——: కృతిభర్త – కందామాత్యుఁడు: — -

మడికి సింగనార్యుఁడు భాగవతదశమస్కంధమును, పద్మపురాణమును దెనిఁగించి ఔబళ కందామాత్యునకుఁ గృతిగా నిచ్చి యున్నాఁడు. పద్మపురాణమందుఁ గృతిపతిని వర్ణించు పద్యము లీక్రింది విధముగా నున్నవి.

సీ॥ స్వామి భక్తుఁడు కార్యచతురుఁడు బహుకళా
   వేది నీతిజ్ఞుఁడు విప్రహితుఁడు
సరస సల్లాపుఁడు సప్తాంగరక్షణ
  క్షముఁడు భావజ్ఞుఁడు సర్వసులభుఁ
డరి మంత్రభేదన పరుఁడు ధర్మాత్ముఁడు
  సుందరాకారుఁడు సుజనవినతుఁ
డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
 సద్గుణాధారుండు సౌమ్యమూర్తి
సతత గురుదేవతా పరిచారరతుఁడు
గుణసముద్రుండు కాశ్యప గోత్రజనితుఁ
డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు
మదన సదృశుండు కందన మంత్రివరుఁడు.
సీ॥ ఈ ధర్మచారిత్రు నేధాత్రిపతి యేలు
  నాధాత్రిపతి యేలు నఖిల జగము
నీకామినీకాము నేకామినులు చూతు
  రాకామినులు చూడ రన్యపురుషు
నీయర్కనుతతుల్యు నేయర్థి గొనియాడు
  నాయర్థి యెరువేఁడ నాస సేయఁ