నది యొడ్డునగల మంజక్కుళి మంటపము నందు వేంచేయగా అచట తిరుమంజనము వైభవముగా జరుగును.
అనంతరము "తుళంగునీణ్ముడి" యను పాశురముతో "నంబెరుమాళ్లకు"(శ్రీరంగనాధులకు) "కులైయార్‌న్ద" అను పాశరముచే "తిరునఱైయూర్" నంబిగారికి మంగళాశాసనము చేసి సాయంకాలమునకు తిరునాంగూర్ వేంచేయుదురు. ఇచ్చట వేంచేసియున్న ఆరు తిరుపతులలోని పెరుమాళ్లకు మంగళాశాసనం చేసి అచటనే వేంచేసి యుందురు.
మరునాడు తిరువాంగూర్ ఆదిగాగల 11 క్షేత్రముల పెరుమాళ్లు మణిమాడక్కోయిల్‌కు వేంచేసి ఆళ్వార్లచే మంగళా శాసనములను పొందుదురు. పెరుమాళ్లు అందరకు తిరుమంజనములు జరిగిన పిమ్మట నాటిరాత్రి పెరుమాళ్లు అందరు గరుడ వాహనముల మీదను ఆళ్వార్లు హంస వాహనము మీదను వేంచేయగా తిరువీధి ఉత్సవము జరుగును.
మరునాడు పెరుమాళ్లు తమ తమ సన్నిధులకు వేంచేయగా ఆళ్వార్లు "తిరిత్తేవనార్‌తుగై" మొదలగు దివ్య దేశములకు మంగళా శాసనం చేసి తిరువాలిని చేరగా అచట వేంచేసియున్న నృసింహస్వామి గరుడవాహనమున సేవ సాదింతురు. వారికి మంగళా శాసనం చేసి తిరుమంగై ఆళ్వార్లు తిరునగరికి వేంచేతురు. ఈ పండ్రెండు గరుడ సేవలు తప్పక సేవింప దగినవి.
మార్గము: శీర్గాళి నుండి 10 కి.మీ.
పా. నన్దావిళక్కే యళత్తఱ్కరియామ్ నరనారణనే కరుమాముగిల్ పోల్
ఎన్దాయ్;ఎమక్కేయరుళా యెననిన్ఱిమై యోర్‌పరమిడమ్ ఎత్తిశైయుమ్;
కన్దార మన్దేనిశై పాడ మాడే కళివణ్డుழிత్త ழிల్ తుదైన్దు;
మన్దారనిన్ఱు మణమల్గునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే
పా. విడై యోడ వెన్ఱాయ్‌చ్చి మెన్ఱోళ్ నయన్ద వికిర్దావిళజ్గు శుడరాழி యెన్ఱుమ్
పడై యోడు శజ్గోన్ఱుడై యాయా యెననిన్ఱమై యోర్ పరవుమిడమ్ పైన్దడత్తు
ప్పెడై యోడు శెజ్గాలవన్నమ్ తుగైప్పత్తొగైప్పుణ్డరీకత్తిడెచ్చెజ్గழுనీర్
మడై యోడ నిన్ఱు మదువిమ్మునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 3-8-1,9
42