17. తిరువాలి తిరునగరి
(శీర్గాళి 18 కి.మీ)
శ్లో. దివ్యేలాతని పద్మినీ తటగతే హ్యష్టాక్షరా గారగ:
భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసన:|
సంప్రాప్తోమృత కుంభ పూర్వ లతికాం శ్రీ కర్దమాలాతని
ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభు: కీర్త్య: కలిధ్వంసిన:
వివ: వయలాలి మణవాళన్-అమృత ఘటవల్లి తాయార్-ఏవరవన్ శిందై తనక్కినియాన్-అలాతని పుష్కరిణీ-అష్టాక్షర విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-అలాతనికి, కర్జమ ప్రజాపతికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: తిరుమంగై ఆళ్వార్ల అవతారస్థలమైన తిరుక్కుఱైయలూర్ ఈ క్షేత్రమునకు సమీపమునే గలదు. వృశ్చికమాసములో కృత్తికా నక్షత్రమునకు ముందు పది దినములు వీరి తిరు నక్షత్రము అతి వైభవముగా జరుగును.
తిరువాలి తిరునగరిలో పంగుని(మీనమాసం) ఉత్తరా నక్షత్రము అవసాన దినముగా బ్రహ్మోత్సవము జరుగును. ఈ ఉత్సవములలో ఎనిమిదవ ఉత్సవమునాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ "ఆడల్ మా" అను అశ్వము మీద వేంచేసి పెరుమాళ్ల తిరువాభరణములు అపహరించు సమయమున జరుగు సంవాదము అతి మనోహరముగా నుండును. తిరువాలి తిరునగరి వాస్తవముగా రెండు తిరుపతులు తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కి.మీ దూరములో నున్నది. తిరువాలి యందు నరసింహస్వామి సన్నిధి కలదు. తిరునగరి యందు వయలాలి మణవాళన్ వేంచేసి యున్నారు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ దూరములో తిరునాంగూరు దివ్యదేశము కలదు. రామానుజ కూటము కలదు.
ఈ క్షేత్రమున వేంచేసియున్న తిరుమంగై ఆళ్వార్ల సౌందర్యము వర్ణానాతీతము. ఆ సౌందర్యమును మణవాళ మామునులు ఇట్లు అభివర్ణించిరి.
అణైత్త వేలుమ్, తొழுత కైయుమ్; అழన్దియ తిరునామముమ్; ఓమెన్ఱ వాయుమ్, ఉయర్‌న్ద మూక్కుం; కుళిర్‌న్ద ముగముమ్; పరంద విழிయుమ్, ఇరన్డు కుழలుమ్, శురుండ వళైయుమ్, పడిత్తకాతుమ్, మలర్‌న్ద కాతు కాప్పుమ్, తాழన్ద శెవియుమ్, శెఱిన్ద కழுత్తుమ్, అకన్ఱ మార్‌పుమ్, తిరన్ద తోళుమ్;నెళిత్త ముతుకుమ్, కువిన్ద విడైయుమ్, అల్లి కయఱుమ్, ఆళున్దియ శీరావుమ్, తూక్కియ కరుజ్గోవైయుమ్, తొజ్గలుమ్ తనిమాలైయుమ్, శాత్తియ తిరుత్తణ్డైయుమ్, శతిరాన వీరక్కழలుమ్, కున్దియిట్ట కణైక్కాలుమ్, కుళిరవైత్త తిరువడి మలరుమ్, మరువలర్‌త ముడల్, తుణియ వాళ్ వీశుమ్, పరకాలన్ మజ్గై మన్నరాన వడివే.
27