పుట:DivyaDesaPrakasika.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో తిరుత్తేరు, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు.

దక్షిణ ప్రాకార వీధి మధ్యలో పాతాళకృష్ణన్ సన్నిధి కలదు. ఇది ఐదు అడుగుల లోతులోనున్నది.

ఏడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చును. కుంభమాస(మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి కలదు. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి కలదు. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.

ఉత్సవ విశేషములు: మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడినది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చినది. కుంభమాసమున "శుద్దఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడినది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడినది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.

ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.

ఈ క్షేత్ర స్వామి విషయమై ఆళ్వార్ల అనుభవములు: నమ్మాళ్వర్ల తిరువాయి మొళి సప్తమ శతకము రెండవ దశకములో (7-2) భగవద్విశ్లేషమును సహింపలేక శ్రీరంగనాథుల శ్రీపాదములలో ప్రపత్తి చేసి అదియు పలింపక పోవుటచే దు:ఖనిమగ్నులై నాయికావస్థను బొంది యుండగా అప్పుడామె