తల్లిగారు తమ కుమార్తె విషయమై "నీవేమి తలచియున్నావనీ" శ్రీ రంగనాథుని ప్రశ్నించుచున్నారు. "ఇవళ్ తిరత్తు ఎన్ శిన్దిత్తాయ్" ఈమె విషయమై ఏమి తలంచితివి?
"అమాయకురాలగు ఈశఠగోపనాయికను పరితపింప చేయుచు నేమియు తెలియని వానివలె కావేరి జలపరిపూర్ణమైన శ్రీ రంగముననాగపర్యంకముపై పవళించి యుంటివా! ఈమెనేమి చేయ దలచితివి ? యని శ్రీ రంగనాథుని సౌహార్దమను గుణమును ప్రకాశింప చేయు చున్నారు.
పెరియాళ్వార్‌ఈదివ్యదేశమును "తిరువాళన్ తిరుప్పది" యని అభివర్ణించి యున్నారు.
తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని "కుడపాలానై" పశ్చిమ దిగ్గజమని వర్ణించియున్నారు.
తెన్నానై-సుందర బాహువు(తిరుమాలిరుంశోలై) దక్షిణది గ్గజమని
వడవానై-తిరువేంగడముడైయాన్-ఉత్తర దిశా దిగ్గజము
కుణపాలమదయానై-శౌరిరాజ పెరుమాళ్-ప్రాక్‌దిశా దిగ్గజము (తిరుక్కణ్ణాపురం) నమ్మాళ్వారు తమ తిరువాయిమొழி ప్రబంధమును శ్రీరంగనాథులకు అంకితము జేసిరి. నమ్మాళ్వార్లు "ముగిల్వణ్ణనడిమేల్ శొన్నశొల్‌మాలై ఆయిరత్తి పత్తుమ్" మొయిలు వంటి కాంతిగల శ్రీరంగనాథుల శ్రీ పాదముల విషయమై సర్వేశ్వరుడు అర్చావతారమున తన నిత్య కృత్యములను ఈ విధముగా నిర్వహించునని పెద్దలు సాదింతురు.
నిద్రమేల్కొనుట | తిరునారాయణపురమున | |
సుప్రభాతసేవ | తిరుమలై | |
స్నానము | ప్రయాగ | |
జపము | బదరికాశ్రమము | |
ఆరగింపు | పూరీ జగన్నాధము | |
రాచకార్యము | అయోధ్య | |
విహారము | బృందావనము | |
శయనము | శ్రీరంగము |
ఈ స్వామి విషయమై వెలసిన స్తోత్రము పెక్కులు. అందుకొన్ని
1. | స్తోత్ర రత్నము | ఆళవన్దార్(యామునా చార్యుల వారు) |
2. | కాన్తా చతుశ్లోకి | (ఆళవన్దార్) |