Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు కలవు. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం జరుగు మండపం. పరమపద వాశల్; తిరుమడప్పళ్లి; ఊంజల్ మండపం; ధ్వజారోహణ మండపం గలవు. ఇచట స్తంభముపై గల వినీత ఆంజనేయస్వామి వరప్రసాది.

మూడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ తిరువీథిలో గరుడన్ సన్నిధి గలదు. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు గలవు. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే కలదు. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచు మండపము గలదు. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి గలదు. ఉగ్రాణము; మేల్ పట్టాభిరామన్ సన్నిధి; ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి గలవు.

నాల్గవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి గలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ వేంచేసి యున్నారు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాదమునుల సన్నిధి గలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.

ఈ ప్రాకారమలో సేవింప దగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ)అవతరించిన విధము చిత్రించబడినది.

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే కలవు. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే యున్నది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షులు వేంచేసియున్నారు. మీనమాస పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము. అది ఈ ప్రాకారములోనే కలదు. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు