Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్‌' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు వేంచేపు చేసికొని పోయిరి. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా వేంచేపు చేసిరి. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగైయార్‌' అని యందురు.

పిళ్లైలోకాచార్యుల వారు తమ "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి "ఇవై యెల్లామ్‌ నమక్కు నంబెరుమాళ్‌ పక్కలిలే కాణలామ్" (ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో కనుపించును) అని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చినది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును ఇట్లు అభివర్ణించిరి. తిరుక్కైయిలే పిడిత్త-దివ్యాయుధజ్గళుమ్; వైత్తు అ-లెన్నకైయుమ్; కవిత్త ముడియుమ్; ముగముమ్;మురువలుమ్; ఆసన పద్మత్తిలే అళుత్తిన తిరువడిగళుమాయ్ నిఱ్కిర నిలయే నమక్కు త్తన్జమ్".

శ్రీ పరాశర భట్టారకులును తమ శ్రీరంగరాజ స్తవమున


శ్లో. అబ్జన్యస్త సదాజ్జ మంచితకటీ సంవాది కౌశేయకం
   కించిత్ తాండవ గంధి సంహసనకం నిర్వ్యాజ మందస్మితమ్|
   చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం
   శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||

గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొందురు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.

మొదటి ప్రాకారమునగల ముఖ్య విశేషములు:- ద్వారపాలకులు, యాగశాల; విరజబావి; సేనమొదలియార్ సన్నిధి; పగల్‌పత్తు మండపం; చిలకల మండపం; కణ్ణన్, సన్నిధి. ఇక్కడ గల చిలుకల మండపము నుండియే విమానముపై గల పరవాసు దేవులను సేవింప వలయును.

రెండవ-ప్రాకారము:- ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం గలదు. ఈ మండపములో