పుట:DivyaDesaPrakasika.djvu/326

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
DivyaDesaPrakasika.djvu

ముదలియాణ్డాన్

తిరునక్షత్ర తనియన్:-
    మేషే పునర్వసు దినే పాంచజన్యాంశ సంభవమ్‌|
    యతీన్ద్ర పాదుకాభిఖ్యం వన్దేదాశరధిం గురుమ్‌||
నిత్యతనియన్:-
    పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా|
    తస్య దాశరధే: పాదౌ శిరసా ధారయామ్యహమ్‌||

వీరు కన్దాడై కుడి(వంశము) యందు మేషమాసమున పునర్వసు నక్షత్రమున పూందమల్లికి సమీపమునగల "పచ్చైవారణ పెరుమాళ్‌కోయిల్" (పేట్టె) యందు పాంచ జన్యాంశము నందవతరించిరి. వీరు ఎంబెరుమానారులకు భాగినేయులు(మేనల్లుళ్ళు). ఎంబెరుమానార్లచే త్రిదండస్థానముగా పరిగణింపబడినవారు.

వీరు చరమ శ్లోకార్థమును సేవింపదలచి ఉడయవరులను ప్రార్థింపగా వారు తిరుక్కోట్టియూర్ నంబిగారి సన్నిధికి పంపిరి. వారును "విద్యామదము ధనమదము అభిజన్మదమను మదత్రయము పోయినచో ఎమ్బెరుమానారులే కృపచేయుదురని వీరిని పంపివేసిరి.

మొదలియాండాను కూడ మిగుల శమదమాది ఆత్మగుణ పరిపూర్తి కలవారై మిక్కిలి ఆర్తితో ఉడయవరుల శ్రీపాదములాశ్రయింపగా స్వామి సంతోషించి వారికి గుహ్యతమైన చరమశ్లోకార్థము ననుగ్రహించి తమకు త్రిదండము చేతికి చిక్కినదని సంతోషించిరి. వీరును ఉడయవర్ శిష్యులలో ప్రధానులు. వీరి సంస్కృతనామము దాశరథి. వీరు ఎంబెరుమానారులకు పాదుకాస్థానీయులుగా పెద్దలు నిర్వహింతురు.

తిరునక్షత్రము: చైత్రం (మేషం ), పునర్వసు
అవతారస్థలము: పచ్చైప్పెరుమాళ్ కోయిల్
ఆచార్యులు: ఎంబెరుమానార్
అనుగ్రహించిన గ్రంథములు: దాటీ పంచకం. రహస్యత్రయం

వాழி తిరునామజ్గళ్

అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాழிయే
      అరుట్పచ్చై వారణత్తిల్ అవదరిత్తాన్ వాழிయే
శిత్తరయిల్ పునర్పూశం శిఱక్క వన్దోన్ వాழிయే
      శీర్ బాషియ మీడుముదల్ శీర్ పెఱువోన్ వాழிయే
ఉత్తమమాం వాదూల ముయర వన్దోన్ వాழிయే
      ఊర్తిరున్ద శీర్పాద మూన్ఱినాన్ వాழிయే
ముద్దిరయుం శెజ్గోలుం ముడిపెఱువోన్ వాழிయే
      ముదలియాణ్డాన్ పొఱ్పదజ్గళ్ ఊழிదోఱుం వాழிయే

220