కూరత్తాళ్వానులు
(కూరేశ మిశ్రులు)
తిరునక్షత్ర తనియన్:-
మకరే హస్త నక్షత్ర సర్ప నేత్రాంశ సంభవమ్
శ్రీ మత్కూర కులాధీశం శ్రీ పత్సాజ్క ముపాస్మహే||
నిత్య తనియన్:-
శ్రీ వత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తి మధీమహి
యదుక్తయ స్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతామ్||
వీరు ఉడయవరుల శిష్యులలో ప్రధానులు. కాంచీపురమునకు సమీపమునగల కూరమను అగ్రహారమున కలియుగాది 4109 సంవత్సరమునకు సరియగు సౌమ్యనామ సంవత్సర తై మాసమున (పుష్య) హస్తానక్షత్రమున సర్పనేత్రాంశము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము తిరుమరు మార్పన్ (శ్రీపత్సాజ్క మిశ్రులు) వీరికి సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమును గుర్తించిన ఉడయవరులు "ఆళ్వాన్" అనిపేరిడిరి.
వీరి దేవిమారులు ఆండాళమ్మగారు. ఈ దంపతులిరువురు పరమ వైరాగ్య సంపన్నులు. మహాసంపన్నులై యుండియు ఆ సంపదనంతయు పరిత్యజించి ఉడయవర్ శ్రీపాదములే రక్షకములని నమ్మియుండిరి.
స్వామి యెంబెరుమానారుల యాజ్ఞచే తిరువరజ్గత్తముదనార్లను దిద్దుబాటుచేసి వారినుండి శ్రీరంగనాథుని సన్నిధి నిర్వాహమును తీసికొని ఉడయవరులకు అప్పగించిరి. శ్రీరంగనాథుని పురోహితులుగా నిత్యము స్వామి సన్నిధిలో కైంకర్యము చేయుచుండెడివారు.
చోళరాజగు క్రిమికంఠుని వలన ఉడయవరులకు ప్రమాదము కలుగనున్నదని తలచి తాము పెరియనంబిగారితో కూడా చోళరాజసభకు పోయి "శివాత్పర తరంనాస్తి" అనువాదమును ఖండించి విష్ణుపరత్వ స్థాపన చేసిన మహనీయులు.
ఉడయవరులను గ్రహించిన శ్రీభాష్యరచనలో మిక్కిలి సహాయము చేసినవారు. వీరి కుమారులు వ్యాసభట్టర్, పరాశరభట్టర్. వీరి ప్రభావము వాచామ గోచారము. పరమ దయాసముద్రులగు వీరి చరితమును గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.
తిరునక్షత్రము: మకరమాసం-హస్తా నక్షత్రం
వీరనుగ్రహించిన గ్రంథములు: పంచస్తవములు 1. శ్రీవైకుంఠస్తవం 2.
221