పుట:DivyaDesaPrakasika.djvu/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమాలైయాణ్దాన్

(శ్రీ మాలాధరులు)

తిరునక్షత్ర తనియన్:-
   కుంభమాసే మఖోద్బూతం మాలాధర ముపాస్మహే
   యామునార్య పదాంభోజ సమాశ్రయణ శాలినమ్‌|
   రామానుజ మునీంద్రాయ ద్రావిండీ సంహితార్థదమ్‌
   మాలాధర గురుం వందే వావదూకం విపశ్చితమ్‌
నిత్యతనియన్:-
   భక్తామృతం వాంఛిత పారిజాతం
   మాలాధరం యామున పాదభక్తమ్‌|
   శ్రీ భాష్య కారస్య హితోపదేశమ్‌
   శ్రీజ్ఞానపూర్ణం శిరసానమామి||

వామనాంశ సంభూతులైన తిరుమాలై యాణ్డాన్ తిరుమాలిరుంశోలై మలై అను దివ్యదేశమున సర్వదారి నామ సంవత్సర కుంభమాసమున మఖానక్షత్రము నందవతరించిరి. మాలాధరులనునది వీరికి సంస్కృత తిరునామము. వీరు శ్రీఆళవన్దారుల శ్రీపాదముల నాశ్రయించి వేదవేదాంత రహస్యములను, దివ్యప్రబంధ విశేషార్థములను గ్రహించిరి.

వీరు తిరుక్కోట్టియూర్ నంబిగారి ఆదేశానుసారము భగవద్రామానుజులకు తిరువాయిమొழி అర్ద విశేషములను అనుగ్రహించిరి. ఆసందర్బములో భగవద్రామానుజులు పలు సందర్బములలో ఆళవందారులు చెప్పిన తాత్పర్యార్థ మిట్లుండునని చెప్పి ఆళవందారుల శ్రీసూక్తులను వినిపింపగా ఆశ్చర్యపడిన మాలాధరులు ఇదియు ఒక అవతార విశేషమా! అని ఆశ్చర్యపడి దండము సమర్పించి తమ కుమారులు సుందరత్తోళుడైయాన్ అనువారిని ఉడయవరులకు శిష్యులనుగా చేసిరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావాదులలో సేవింపవచ్చును.

214