తిరువరంగప్పెరుమాళ్ అరయర్
(శ్రీ రంగదేశికులు)
తిరునక్షత్ర తనియన్:-
వృషభే జ్యేష్ఠ నక్షత్రే జాతాం శ్రీ రంగదేశికమ్
యామూనార్య సుతం వన్దే శంఖ కర్ణాంశ సంభవమ్
శ్రీ రామమిశ్ర పదపంకజ చంచరీకం
శ్రీ యామునార్య పరపుత్ర మహం గుణాడ్యమ్
శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||
నిత్యతతనియన్:-
అధ్యాపయ ద్యతీంద్రాయ పరాంకుశ సహస్రికామ్|
తన్నాథ వంశ్యం వన్దేహం శ్రీ రంగాధిపదేశికమ్.
వీరు ఆళవందారుల తిరుకుమారులు. వీరితల్లిగారు శ్రీరంగ నాచ్చియార్. తెయ్‌వత్తక్కరశునంబి, పిళ్లైయరశునంబి, శెట్టై నంబి అనువారు. ఆచార్యులు మణక్కాల్ నంబిగారు.
తిరువరంగప్పెరుమాళ్ అరయర్ ప్రతినిత్యము శ్రీరంగనాథుల సన్నిధిలో దివ్యప్రబంధమును గానము చేసెడివారు. ఆళవందారుల ఆజ్ఞచే కాంచీపురమునకు పోయి వరదరాజస్వామిని ప్రసన్నుని చేసికొని భగవద్రామానుజులను శ్రీరంగమునకు తీసికొనివెళ్లిరి. వీరి సన్నిథిలో ఎంబెరుమానార్లు దివ్య ప్రబంధములను, చరమ సర్వనిష్ఠా రహస్యములను (ఆచార్యుల యందు భక్తి కలిగియుండుటచే ఉత్తారకము) తెలిసికొనిరి.
215