పుట:DivyaDesaPrakasika.djvu/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణక్కాల్ నంబి

(శ్రీరామమిత్రులు)

తిరునక్షత్ర తనియన్:-
    కుంభ మాసే మఖోద్బూతం రామమిశ్ర ముపాస్మహే
    పుణ్డరీకాక్ష పాదాబ్జ సమాశ్రయణ శాలినమ్‌||
నిత్యతనియన్:-
    అయత్నతో యామున మాత్మదాస మలర్క పత్రార్పణ నిష్క్రియేణ|
    య: క్రీతవా నాస్థిత యౌవరాజ్యం నమామి తం రామ మమేయ సత్వం||

వీరు విరోధినామ సంవత్సర కుంభమాసమున శుద్ద చతుర్దశి మఖా నక్షత్రం బుధవారమున చోళదేశమందలి తిరుక్కావేరి తీర గ్రామమైన మణక్కాల్ అనుదివ్య దేశమునందు కుముదాక్షాంశముతో నవతరించిరి.

వీరు ఉయ్యక్కొండారుల ప్రధానశిష్యులు. వారి తర్వాత సంప్రదాయ ప్రవర్తకులుగా వేంచేసియున్నవారు. వీరికి ఆచార్యాభిమానము మెండు: ఉయ్యక్కొండారుల దేవిమారులు (భార్య) పరమపదింపగా వీరు ఆచార్య గృహకృత్యములన్నింటిని నెరవేర్చెడివారు. ఒకనాడు ఆచార్యులు కుమార్తెలు ఒక కాలువ దాటవలసివచ్చెను. వీరు వారిని తమ భుజములపై నిడికొని కాలువ దాటించిరి. ఉయ్యక్కొణ్డారులీ విషయము తెలిసి వీరిని విశేషముగా కృపచేసిరి.

వీరు ఆళవందారులకు ఆచార్యులు. రాజ్య పదమునందున్న ఆళవందారులను ఉపాయముగా వశీకరించుకొని వారికి మంత్ర త్రయమును దివ్య ప్రబంధములను సకల రహస్యములను ఉపదేశించిన మహనీయులు. వీచరితమును గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.

తిరునక్షత్రము: కుంభమాసం, మఖానక్షత్రం
అవతారస్థలం: మణైక్కాల్
ఆచార్యులు: ఉయ్యక్కొణ్డార్
శిష్యులు: ఆళవన్దార్ మొదలగువారు

వాழி తిరునామజ్గళ్

తేశముయ్య క్కొణ్డవర్‌తాళ్ శెన్నివైప్పోన్ వాழிయే
తెన్నరజ్గర్ శీరరువై చ్చేర్‌న్దిరుప్పోన్ వాழிయే
దాశరది తిరునామమ్‌ తழைక్కవన్‌దోన్ వాழிయే
తమిழ் నాదముని యుగపై త్తాపిత్తాన్ వాழிయే
నేశముడ నారియనై నియమిత్తాన్ వాழிయే
నీణిలత్తిల్ పతిన్ మర్కలై నిఱుత్తినాన్ వాழிయే
మాశిమగన్తనిల్ విళ్జ్గ పన్దుదిత్తాన్ వాழிయే
మాల్‌మణక్కాల్ నమ్బి పదమ్ వైయగత్తిల్ వాழிయే.

207