పుట:DivyaDesaPrakasika.djvu/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆళవందార్

(యామునమునులు)

తిరునక్షత్ర తనియన్:-
   శుచౌ మాస్యుత్తరాషాడా జాతాం యామున దేశికం |
   శ్రీ రామమిశ్ర చరణ సరోజాశ్రిత మాశ్రయే|
నిత్యతనియన్:-
   యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తా శేష కల్మష:|
   వస్తుతా ముపయాతోహం యామునేయం నమామితమ్‌||

వీరు నాథమునుల పౌత్రులు. ఉడయవరులకు పరమాచార్యులు. వీరు దాతృనామ సంవత్సర కర్కాటక మాసము ఉత్తరాషాడ నక్షత్రమున విష్వక్సేసుల మంత్రులలో నొకరగు సింహముఖుని అంశమున ఈశ్వరమునులకు కుమారులుగా వీరనారాయణపురము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము యమునై త్తుఱవర్.

ఆనాటి చోళరాజు ఆస్థానమున నుండిన విద్వజ్జన కోలాహలుడను పండితుని వాదమున జయించి అర్దరాజ్యమును సంపాదించి రాజ్యసుఖములనుభవించు చుండిరి. అంతట శ్రీరామమిత్రులు (మణక్కాల్ నంబి) తమ ఆచార్యాజ్ఞానుసారము యామునమునులను అనుసరించి వారిని వశీకరించుకొని మంత్ర మంత్రార్థములను దివ్య ప్రబంధములను సకల రహస్యములను అనుగ్రహించిరి.

కాంచీపురమున వరదరాజస్వామి సన్నిధిలో స్వామి ఎంబెరుమానారులను చూచి వారిని దర్శన ప్రవర్తకులుగా కటాక్షించిరి. ఎంబెరుమానారులు వీరిని సేవించుటకు శ్రీరంగమునకు వేంచేయగా అప్పటికే వీరు పరమపదించిరి. ఆ సమయమున మూడు వ్రేళ్లు ముడుచుకొనియుండగా ఉడయవరులు మూడు ప్రతిజ్ఞలుచేసి మూడువ్రేళ్లను తెరిపించిరి.

వీరి సన్నిధిని ఆశ్రయించిన వారు 1. పెరియనంబి 2. తిరుక్కోట్టియూర్ నంబి 3. పెరియ తిరుమలై నంబి 4. మారనేరినంబి 5. తిరుక్కచ్చి నంబి 6. ఆళవందారాళ్వాన్ 7. తిరుమాలై యాణ్డాన్ 8. వానమామలై ఆణ్డాన్ 9. తెయ్‌వవారియాణ్డాన్ 10. ఈనాణ్డాన్ 11. జీయరాణ్డాన్ 12. తిరుక్కురుగూరప్పన్ 13. తిరుమోక్కరప్పన్ 14. తిరుమోక్కర్ నిన్ఱాన్ 15. తెయ్‌వపెరుమాళ్ 16. వకుళాభరణసోమయాజియార్ 17. తిరుక్కురుగూర్ దాసర్ 18. తిరుమాలిరుంశోలై దాసర్ 19. వడమధురై పిరన్దాన్ 20. ఆళ్కొణ్డి అమ్మంగి అనువారలు.

అనుగ్రహించిన గ్రంథములు: 1.స్తోత్రరత్నము 2. చతుశ్శ్లోకీ 3. సిద్దిత్రయము 4. ఆగమప్రామాణ్యము గీతార్థ సంగ్రహమ్‌.

208