నమ్మాళ్వార్
తిరునక్షత్ర తనియన్:-
వృషభేతు విశాఖాయాంకురికాపురి కారిజమ్
పాండ్యదేశే కలేరాదౌ శఠారిం పైన్యసం భజే||
నిత్యతనియన్:-
మాతాపితా యువతయ స్తవయా విభూతి
స్సర్వం యదేవ నియమేన మదంవయానామ్|
అధ్యస్యన:కుపపతే ర్వకుళాభి రామం
శ్రీ మత్తరంఘ్రి యుగళం ప్రణమామి మూర్థ్నా||
ప్రసన్న జనకూటస్థులగు నమ్మాళ్వార్లు కలియుగాది 43 వ దినమగు ప్రమాది నామ సం||ర వైశాఖ శుక్ల చతుర్దశీ శుక్రవారం విశాఖా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమున ఉడై యనంగై యార్ (నాథనాయకి) కారియార్ అను దంపతులకు పుత్రులుగా తిరుక్కురుగూర్ నందవతిరించిరి. వీరు విష్వక్సేసుల యవతారము.
వీరు జన్మించిన దాదిగా స్తన్యపానము చేయక భగవద్గుణానుభవముతో కాలము గడుపుచుండగా తల్లిదండ్రులాశ్చర్యపడి వీరిని "పొలిన్ద నిన్ఱపిరాన్" అను పెరుమాళ్ల సన్నిధికి తీసికొనిపోయిరి. వీరును నేత్రములు తెఱచి పెరుమాళ్లను సేవించి శేషాంశము నందవతరించిన "తిరుప్పుళియాళ్వార్ల" (నిద్రపోని చింతమాను) క్రింద యోగనిష్ఠులై వేంచేసిరి. వీరికి శఠగోపులనియు, వకుళాభరణములు అనియు, పరాంకుశులు అనియు తిరునామములు కలవు
మధుర కవి యాళ్వార్లు ఉత్తరదేశయాత్ర చేయుచు అయోధ్యలో నుండగా నొకనాటి రాత్రి దక్షిణదేశమునుండి ఒక కాంతిపుంజము కనుపింపగా దానిననుసరించి తిరుక్కురుగూర్ చేరి ఆళ్వార్లను సేవించిరి. వారు యోగనిష్ఠలో నుండుటచే వారిని మేల్కొలుపుటకై పెద్దరాతిని పడవేసి శబ్దము చేసిరి. అంతట కనులు తెఱచి చూచిన ఆళ్వార్లను, స్వామీ! ప్రకృతిలో జన్మించిన జీవుడు దేనిని తిని యెచట పరుండునని ప్రశ్నింపగా ఆళ్వార్లు దానినే తిని అచటనే పడియుండునని సమాదానము చెప్పిరి. మధుర కవులు సంతసించి ఆళ్వార్లకు శిష్యులైరి. వీరి వైభవము వాచాను గోచరము. గురుపరంపరా ప్రభావాదులతో సేవింపవచ్చును.
అవతారస్థలము:తిరుక్కురుగూర్(ఆళ్వార్‌తిరునగరి).
తిరునక్షత్రం:వృషభం, విశాఖ.
ఆచార్యులు: సేనముతలియార్.
ప్రబంధము: తిరువిరుత్తం 100, తిరువాశరియం 7
186