తిరుమழிశై యాళ్వార్
తిరునక్షత్రతనియన్:-
సుఖాయాం సుకరేమాసి చక్రాంశం భార్గవోద్భవమ్
మహీసార పురాధీశం భక్తిసార మహం భజే|
నిత్యతనియన్:-
శక్తి ప--మయ విగ్రహాత్మనే, శుక్తిహారజిత చిత్తహారిణే
ముక్తిదాయక మురారి పాదయో భక్తిసారముపయే నమోనమ:||
వీరు తొణ్డమణ్డలములో చేరిన "తిరుమழிశై" అను క్షేత్రమునందు ద్వాపరంతమున విభవనామ సంవత్సర మకరమాసమున కృష్ణదశమీ గురువారం మఖా నక్షత్రమునందవతిరించిరి. వీరు భార్గవమహర్షికి కనకాంగి యను అప్సర స్త్రీవలన జన్మించిరి. తిరుమழிశై యను క్షేత్రము నందవతరించుటచే తిరుమழிశై యాళ్వార్ అనిప్రసిద్ధినొందిరి. వీరు చక్రాంశజులు.
వీరుమొదట శైవ సిద్దాన్తమునందు ప్రవేశించిరి. వీరి వృత్తాన్తమును తెలిసిన పేయాళ్వార్లు వీరున్నచోటునకు పోయి వారికి శ్రీవైష్ణవ సిద్దాన్తము నందు రుచి కలుగజేసి పంచ సంస్కారములననుగ్రహించిరి. వీరిప్రభావము అమితమైనది. దానిని గురుపరంపరాప్రభావాది గ్రంథములలో చూడనగును.
ఆళ్వార్లు:- తిరుమழிశై ఆళ్వార్, భక్తిసారులు.
తిరునక్షత్రం:-మకరమాసం-మఖానక్షత్రం.
ఆచార్యులు:-పేయాళ్వార్.
అవతారస్థలం:-తిరుమழிశై.
పరమపదము:-తిరుక్కుడన్దై.
ప్రబంధము:-నాన్ముగన్ తిరువన్దాది 96 పా. తిరుచ్చన్దవిరుత్తము 120 పా.
మంగళాశాసన దివ్యదేశములు:-16
నాళ్‌పాట్టు
తై యిల్ మకం ఇన్ఱు;తారణియీర్! ఏత్‌తం-ఇన్ఱ
త్తై యిల్ మగత్తుక్కు; చాత్‌తు గిన్ఱేన్-తుయ్యమది
పెత్‌త మழிశై ప్పిరాన్;పిఱన్ద నాళెన్ఱు;
వల్‌తవరగళ్;కొణ్డాడుం నాళ్.
వాழிతిరునామమ్
అన్బుడ వన్దాది తొణ్ణూత్తాఱురైత్తాన్ వాழிయే
అழగారుం తిరుమழிశై యమర్‌న్ద శెల్వన్ వాழிయే
ఇన్బమిగు తై యిల్ మగత్తిజ్గువన్దాన్ వాழிయే
ఎழிల్ చన్ద విరుత్తం నూత్తిరుపత్తీన్దాన్ వాழிయే
మున్బుగత్తిల్ వన్దుతిత్త మునివనార్ వాழிయే
ముழுప్పెరుక్కిన్ పొన్నియెదిర్ మిదన్ద కొల్లోన్ వాழிయే
నన్బువియల్ నాలాయిరతైழு మాత్తాన్ వాழிయే
వజ్గళ్ పత్తిశారార్ ఇఱునఱ్పదజ్గళ్ వాழிయే
185