పుట:DivyaDesaPrakasika.djvu/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకాకుళం - 69

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఇది కృష్ణాతీరమునగల ప్రాచీన దేవాలయము. ఈస్వామి శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నమున సాక్షాత్కరించి ఆముక్త మాల్యదను రచింపుమని ఆదేశించినట్లు రాయలు తన ఆముక్తమాల్యద పీఠికలో తెలియజేసెను.

మార్గము: కృష్ణాజిల్లా చల్లపల్లికి సమీపములో గలదు.

భీమవరం - 70

శ్రీరామకోటి క్షేత్రము. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వాముల వారి శ్రీహస్తములచే ప్రతిష్ఠింపబడిన రామకోటిక్షేత్రము. దీనిని భగవద్రామానుజ దర్శన కైంకర్య సమితివారు నిర్వహించుచున్నారు. నిత్య కల్యాణము, నిత్య తదీయారాధనము జరుగు చున్నవి. ఉభయవేదాన్త సభలను నిర్వహించు చున్నారు.

మార్గము: ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రధాన నగరములలో ఒకటి.

DivyaDesaPrakasika.djvu

గుమ్మడదల - 71

ఇది ప్రాచీనమైన క్షేత్రము. కల్యాణ రామచంద్ర స్వామి దేవస్థానము కలదు. ఈ సన్నిధిలో జరుగు అధ్యయనోత్సవమును శ్రీ ఘంటంభట్ట వేంకట భుజంగరాయశర్మ గారు మనోహర కావ్యముగా రూపొందించినారు.

మార్గము: మెదక్ జిల్లా నరసాపూర్‌కు సమీపములో కలదు.

180