అభినవ భూతపురి (నరసాపురము) - 21
శ్లో. శ్రీ కేశవం కరతలోద్ధృత రమ్య పద్మం
చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం
మార్తాండకోటి రుచిరోజ్జ్వల చక్రరాజం
వందే గదాధర మహం సురబృందవంధ్యమ్.
శ్రీమతేవాప్త కామాయ కల్యాణగుణ సింధవే
బంధనే సర్వలోకానం కేశవాయ నమో నమ:.
ఆదికేశవప్పెరుమాళ్-యతిరాజనాథవల్లి త్తాయార్-అనంతపుష్కరిణీ-అనంతవిమానము -నిలచున్నసేవ-తూర్పుముఖము-వసిష్ఠగోదావరి. భగవద్రామానుజుల సౌందర్యము వర్ణనాతీతము. వీరు శ్రీ పెరుంబూదూరులో ప్రతిష్ఠింపబడి అచటస్వామితో ఏకాసవాసీనులై ఆరుమాసములు అర్చనాదులు స్వీకరించి అచటనుండి నరసాపురము వేంచేసిరి. అట్లు వేంచేయునపుడు స్వామితోపాటు అచటవేంచేసియున్న ముదలియాండాన్(పాదుకలు) కూడా ఇచటకు వేంచేసిరి.
ఇచటగల సన్నిధి పెరుమాళ్లు ఉత్సవాదులు అన్నియు శ్రీ పెరుంబుదూరు సన్నిధిని పోలియుండుటచే దీనికి "అభినవభూతపురి" యనిపేరు వచ్చెను. మేషమాసములో శ్రవణం తీర్థోత్సవముగా తొమ్మిది దినములు బ్రహ్మోత్సవము; మేషం ఆర్ద్రానక్షత్రం తిరినక్షత్రోత్సవంగా పదిదినములు ఉడయవరుల తిరునక్షత్రోత్సవములు అతివైభవముగా జరుగును. ఈ సమయములో వచ్చు భక్తులకు తదీయారాధన సౌకర్యము కూడకలదు.
నూరుసంవత్సరములకు పూర్వము నూజివీడు సంస్థాన ఆస్థాన మహావిద్వాన్ ఉ.వే.శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామి వారు ఈసన్నిధి వైభవమును ఉత్సవములను కావ్యముగా రచించుటయేగాక ఉత్సవములను వైభవముగా జరిపించి తదీయారాదనాధుల నేర్పాటుచేసిరి. అదినేటికిని జరుగుచుండుట ముదావహము. ఇచట నుండి పోయి అంతర్వేది సేవింపవచ్చును.
మార్గము: ఇది పశ్చిమగోదావరి జిల్లాలో కలదు. విజయవాడ, రాజమండ్రి మొదలగు చోటనుండి బస్ రైలు వసతులు కలవు.
పా. కేశవన్ తమర్‌కీழ் మేలెమ రేழெழுపిఱప్పుమ్
మాశదిరు పెత్‌త్తు నమ్ముడైయ వాழ்వు వాయ్‌క్కిన్ఱవా
ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.
నమ్మాళ్వారు తిరువాయిమొழி 2-7-1
157