పుట:DivyaDesaPrakasika.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొండనూరు - 18

నంబినారాయణ్ పెరుమాళ్-పార్థసారది-అరవిందవల్లి త్తాయార్-రుక్మిణీదేవి-తూర్పుముఖము-నిలచున్నసేవ-భాష్యకారర్‌నది మిట్టపై నరసింహస్వామి సన్నిధి కలదు.

విష్ణువర్థన మహారాజు కుమార్తెకు పట్టిన బ్రహ్మరక్షస్సును భగవద్రామానుజులు పోగొట్టిన స్థలము.

మార్గము: ప్రెంబి రాక్స్ నుండి 6 కి.మీ. మేల్కోట్టె నుండి 30 కి.మీ.

సింహాచలము - 19

శ్లో. త్రాహితి వ్యాహరంతం త్రిదశరిపు సుతం త్రాతుకామోరహస్యే
   విస్రప్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేవ గృహ్ణన్
   వేగశ్రాంతం వితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ
   సింహాద్రౌ శ్రీఘ్రపాత క్షితిపిహితవద: పాతుమాం నారసింహ:||

వివ: వరాహ లక్ష్మీ నరసింహస్వామి-వక్షస్థలమున లక్ష్మీ-లక్ష్మీతీర్థం-నృసింహదార-తార్ష్యాద్రి విమానము-ప్రహ్లాదునకు, వురూరవ చక్రవర్తికి, దేవతలకు, సనకాదులకు ప్రత్యక్షము.

ప్రతి సంవత్సరం వైశాఖశుద్ద తదియనాడు జరుగు చందనోత్సవము సేవింపవలెను. ఆరోజున స్వామి నిజరూపముతో దర్శనమిత్తురు. మిగిలిన దినములలో స్వామి చందనక్కాప్పుతో వేంచేసియుందురు. ఇచట కృష్ణమాచార్యులు అను భక్తులు స్వామికి అంతరంగికులుగా నుండెడివారు.

భగవద్రామానుజులు ఈక్షేత్రమునకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిరి.

మార్గము: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి 10 కి.మీ.

శ్రీ కూర్మము - 20

కూర్మనాథస్వామి-కూర్మనాయకి-కూర్మవిమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-చక్రతీర్థము-లాంగలతీర్థము-వంశధారానది-శ్వేతమహారాజునకు, తిలోత్తమ, వక్రాంక మహర్షులకు ప్రత్యక్షము. శ్వేతభూమి భగవద్రామానుజులు ఇచటకు వేంచేసి శ్వేత మృత్తికను స్వీకరించినారు.

మార్గము: శ్రీకాకుళం స్టేషన్ రోడ్డు నుండి 25 కి.మీ. శ్రీకాకుళం నుండి బస్ వసతి గలదు.

                                           156