పుట:DivyaDesaPrakasika.djvu/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


6. కాట్టుమన్నార్ కోయిల్

శ్లో. వేదపుష్కరిణీ తీరే విమానే పుణ్యనామకే
   వీరనారాయణోభాతి మన్యక్షేత్రే శ్రియాసహ||

వివ: వీరనారాయణప్పెరుమాళ్-మరకతవల్లి తాయార్-శెంగమలవల్లి తాయార్-వేదపుష్కరిణి-పుణ్యవిమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-కావేరినది-మతంగ మహర్షికి ప్రత్యక్షము-శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీమన్నాథమునులు-ఆళవన్దారులు అవతరించిన స్థలము.

విశే: ఈక్షేత్రమునకు కాట్టుమన్నార్ కోయిల్ అనియు మన్యు క్షేత్రమనియు నామాంతరములు కలవు. వీరనారాయణప్పెరుమాళ్ వేంచేసియుండుటచే వీరనారాయణపురమనియు, మన్ననార్ (రాజగోపాలన్) వేంచేసియుండుటచే మన్నార్‌కోయిల్ అనియు పేర్లు కలవు. కాట్టుమ్ అనగా "చూపించునది" అని అర్థము. నమ్మాళ్వార్‌లయొక్క సంప్రదాయమును చూపుటచే కాట్టుమన్నార్ కోయిల్ అనిపేరువచ్చెను.

శ్రీమన్నాథమునులు ఆళ్వార్‌తిరునగరిలో నమ్మాళ్వార్‌లను సాక్షాత్కరింప చేసుకొని నాలాయిర దివ్య ప్రబంధమును పొందిరి. మన్ననార్ స్వామి నాథమునులకు స్వప్నమున సాక్షాత్కరించి దివ్యప్రబంధమును తమ సన్నిధిలో అనుసంధింపుడనికోరిరి. ఆళ్వార్‌లును, నాథమునులను అట్లే ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞా ప్రకారము నాథమునులు కాట్టుమన్నార్ కోయిల్‌కు వేంచేసి దివ్యప్రబంధమును విన్నవించిరి. ఈ విధముగా నాలాయిర దివ్య ప్రబంధము మొట్టమొదట ఈసన్నిధిలోనే అనుసంధానము చేయబడినది.

తిరునెడుందాండగం ప్రబంధములోని పొన్నానాయ్ అనుపాశురములోని కుణపాల మదయానాయ్ అనుదానిని పెరియవాచ్చాన్‌పిళ్లై గారు ఈ క్షేత్రస్వామి విషయముగా వ్యాఖ్యానించిరి.

మార్గము: విరుదాచలం నుండి, చిదంబరం నుండి 25 కి.మీ.

పొన్నానాయ్ పొழிలేழுమ్‌ కావల్‌పూణ్డ,
      పుగழாనాయిగழ் వాయతొణ్డనేన్ నాన్;
ఎన్నానాయెన్నావా యెన్నిలల్లాల్
      ఎన్ఱఱివనే ழைయేన్, ఉలగమేత్తుమ్‌
తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలానాయ్
     కుణపాల మదయానాయ్ ఇమై యెఱ్కెన్ఱుమ్‌
మున్నానాయ్; పిన్నానార్ వణ్జ్గుమ్‌శోది
     తిరుమూழிక్కళత్తానాయ్ ముదలానాయే
            తిరునెడున్దాణ్డగమ్‌-10

                             149