పుట:DivyaDesaPrakasika.djvu/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


5. రాజమన్నార్ కోయిల్

శ్లో. దివ్యే హరిద్రాఖ్య తరంగవత్యా:
   స్థితేతుమన్నార్ నగరే ప్రతీరే
   శ్రీ శంఖ చక్రాఖ్య గజేంద్ర కృష్ణ
   ముఖైస్సు తీర్థే రపి శోభమానే||

   రమ్యాబ్జవల్లీ ప్రియయాసమేత:
   ప్రాచీముఖో గోబిల యోగిదృష్ట:
   శ్రీరాజగోపాల విభు స్స్వయంభూ
   వైమాన సంస్థానయుతో విభాతి||

వివ:- రాజగోపాలన్-రమ్యాబ్జ(హేమాబ్జ)వల్లితాయార్-హరిద్రానది-స్వయంభూ విమానము-శంఖ, చక్ర, గజేంద్ర, కృష్ణ మున్నగు తీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-గోబిలమునికి ప్రత్యక్షము.

విశే:- ఈ క్షేత్రమునకు చంపకారణ్యక్షేత్రమనిపేరు. ఈ సన్నిధి శ్రీరంగమువలె ఏడు ప్రాకారములతో విలసిల్లు చున్నది. రాజగోపాలస్వామి ముగ్థమనోహరులై సేవించువారి హృదయములను అపహరింతురు. మూలవరులకు "వాసుదేవర్" అని తిరునామము. గోప్రళయమహర్షికి స్వామితన(కృష్ణ) లీలలను ఇచట అనుగ్రహించి నందున ఈ క్షేత్రమునకు దక్షిణద్వారకయని పేరువచ్చెను. మీనం మాసమున 18 రోజులు బ్రహ్మోత్సవం జరుగును. మిధునమాసములో 10 దినములు తెప్ప ఉత్సవము జరుగును.

మార్గము:- తంజావూరుకు 35 కి.మీ. కుంభకోణం నుండియు పోవచ్చును. ఈక్షేత్ర సమీపమున వడువూర్ అనుక్షేత్రము తప్పక సేవింపవలెను.

పా. ఉన్నిత్తు మత్‌తొరు తెయ్‌వ; వొழாళవనై యల్లాల్;
   మమ్మిచ్చై శొల్లి; మమ్‌తోళ్ కులైక్కప్పడు మన్నైమీర్;
   మన్నప్పడు మఱై వాణనై, వణ్డువరావతి
   మన్నవై, ఏత్తుమినేత్తుదలుమ్‌ తొழுదాడుమే|
          తిరువాయిమొழி 4-6-10

                        148