పుట:DivyaDesaPrakasika.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్కతులై అంత:పురమందలి శ్రీరామప్రియలను సేవింపగానే వారు ఆశ్రిత వాత్సల్యముతో వచ్చి ఉడయవరుల ఒడిలో కూర్చుండ ఉడయవరులు ఆనందముతో "ఎన్నుడైయ శెల్వప్పిళ్ళయో" ఆని పలుకుటచే తదాదిగా వారికి శెల్వపిళ్ళైయను తిరునామమేర్పడినది.

స్వామి యెంబెరుమానారులు తిరువాయిమొழிని పెంచిన తల్లియగుటచే నాల్గవ దశకమున మొదటి తిరువాయిమొழிయగు "ఒరునాయకమాయ్" అను దశకమును ఈక్షేత్రస్వామి విషయముగా సమర్పించిరి.

పెరుమాళ్ళ ఆజ్ఞచే గరుడాల్వారు శ్వేతదీపమందలి "మృత్తికను" తీసుకొనివచ్చి ఈ క్షేత్రమునందుంచుటచే నిచటి తిరుమణి ప్రభావ సంపన్నమైనది. ఇచట ఉడయవరులు పండ్రెండు సంవత్సరములు వేంచేసియుండిరి. ఆకాలముననే వారి తిరుమేని(అర్చా విగ్రహమును) భక్తులు ప్రతిష్టించిరి.

ఇచటి కొండమీద నరసింహస్వామి, ఉడయవర్, వేదాన్త దేశికులు సన్నిధులు గలవు. శ్రీపరాశర భట్టారకుల శిష్యులగు నంజీయరు అనువారు ఇచటనే అవతరించిరి.

మార్గము: బెంగుళూరునకు 60 కి.మీ. మేల్కొట్టె యనియే చెప్పాలి.

శ్లో. ఆరుహ్యామల యాదవాద్రి శిఖరం కల్యాణ తీర్థే తత:
   స్నాత్వా లక్ష్మణయోగిన: పదయుగం సత్వాతు గత్వాతత:
   శ్రీనారాయణ మేత్య తత్ర ధరణీ పద్మాలయా మధ్యగం
   వశ్యేయం యది కిన్త స:ఫల మతస్సంపత్కుమారం హరిమ్‌||

పా. ఒరునాయకమా యోడ పులగుడవాణ్డవర్
   కరువాయ్ కవర్‌న్ద కాలర్ శిదైగియ పావైయర్
   పెరునాడుకాణ విమ్మైయిలే పిచ్చైత్తామ్‌ కొళ్వర్
   తిరువారణన్ఱాళ్ కాలమ్బెఱ చ్చిన్దిత్తుయ్‌మినో
         నమ్మాళ్వార్లు-తిరువాయిమొழி 4-1-1


మంచిమాట

ఎంబెరుమాన్ తాకితొழுవార్ ఎప్పొழுదుమ్‌ ఎన్‌మనత్తే ఇఱిక్కిన్ఱారే

"శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరించువారు ఎల్లప్పుడు నామనస్సులో నిలచియుందురు". అను తిరుమంగై యాళ్వార్ల శ్రీ సూక్తిని మరువక స్మరింపుడు. భాగవత అభిమానమే ఉత్తారకము.

"ఆళవందారులు"

                                                 147