7. శ్రీ పెరుంబూదూరు
శ్లో. శ్రీ రామానుజ నామ పుష్కరిణికా తీరేస్థిత:ప్రాజ్ముఖ
శ్శ్రీమద్భూతపురే యతీంద్ర కరుణా సంధుక్షిత శ్రీయుతే|
నాయక్యా యతిరాజ వల్ల్యభిదయా శ్రీ కేశవార్యేక్షితో
నిత్యం రాజతి చాదికేశవ విభు శ్శ్రీవైష్ణవేష్ట ప్రద:||
వివ: ఆదికేశవప్పెరుమాళ్-యతిరాజనాథవల్లి తాయార్-శ్రీరామానుజ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-భగవద్రామానుజులు అర్చారూపముగా తానభిమానించి వేంచేసిన దివ్యదేశము. శ్రీ కేశవార్యులకు ప్రత్యక్షము-భూతపురియను ప్రసిద్ధ తిరునామము.
విశే: విశిష్టాద్వైత సిద్ధాన్త ప్రవర్తకులగు భగవద్రామానుజులవారు అవతరించిన దివ్యదేశము - వారు అభిమానించి అనుగ్రహించిన అర్చామూర్తిని వారి అవతార కాలముననే సన్నిధిలో ప్రతిష్టించిరి. పూర్వాచార్యులందరు అభిమానించి సేవించిన దివ్యదేశము. ఇచట వేంచేసియున్న ఆదికేశవ ప్పెరుమాళ్ వరప్రసాది. వారి కటాక్షము వలన ఆ సూరికేశవాచార్యులు కాంతిమతీ దంపతులకు భగవద్రామానుజులు అవతరించిరి. శ్రీవైష్ణవులు తప్పక సేవింపవలసిన దివ్యదేశము.
మార్గము: మద్రాసు నుండి బెంగుళూరు పోవుమార్గములో మద్రాసు నుండి 30 కి.మీ.
పా. కేశవన్ తమర్ కీழ் మేలెమ రేழெழுపిఱప్పుమ్
మాశదిరు పెత్‌త్తు వమ్ముడైయ వాழ்వు వాయ్‌క్కిన్ఱవా
ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.
నమ్మాళ్వారు తిరువాయిమొழி 2-7-1
పూమన్ఱు మాదుపొరున్దియమార్‌వన్; పుగழ்మలిన్ద
పామన్ను మాఱనడిపణిన్దుయ్‌న్దవన్; పల్ కలై యోర్
తామ్ మన్న వన్ద యిరామానుశన్ శరణారవిన్దమ్,
నామ్‌మన్నివాழ, నెంజే! శొల్లువోం అవన్నా మజ్గళే
ఇరామానుశమాత్ తన్దాది - 1
150