పుట:DivyaDesaPrakasika.djvu/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

99. నైమిశారణ్యం - 4

శ్లో. దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే |
   పుండరీక లతా నాధో దేవరాజాహ్వయో హరి:||
   విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియ:|
   దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్ష: కలిజిన్నుత:||

వివ: దేవరాజన్-పుండరీక వల్లి-దివ్య విశ్రాంత తీర్థము-శ్రీహరి విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-దేవర్షులకు ఇంద్రునకు-సుధర్మునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచట మఠములు, రామానుజ కూటములు కలవు. వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని యిచటలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు గలవు. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు గలవు.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పెనట. ఆపడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు అష్టాదశ పురాణములను వినిపించెను.

మార్గము: లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి. <poem> పా. వాణిలాముఱవల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే

 పేణినేన్; అదవై ప్పిழைయెనక్కరుది ప్పేదై యేన్‌పిఱవినో యఱుప్పాన్
 ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళై యవర్ కలవియిన్దిఱత్తై
 నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; నైమిశారణియత్తుళెన్దాయ్.
    తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-6-1

</

poem>

                       133