100. శాళక్కిఱామం (సాలగ్రామమ్) - 5
శ్లో. గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||
వివ: శ్రీమూర్తి పెరుమాళ్-శ్రీదేవి తాయార్-గండకీ నది-చంద్ర తీర్థము-కనక విమానము-ఉత్తరముఖము-నిలచున్నసేవ- గండకీ అనువేశ్యకు-శివునకు-బ్రహ్మకు ప్రత్యక్షము-పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: స్వయం వ్యక్తక్షేత్రము. నేపాల్ దేశమున గలదు. ఖాట్మండుకు 175 మైళ్ల దూరమున గల ముక్తినాధ్‌క్షేత్రమే సాలగ్రామము.(ఖాట్మండుకు 65 మైళ్ల దూరమున గల దామోదర కుండమే సాలగ్రామమని కొందరి అభిప్రాయము)గండకీనది జన్మస్థానము. ఈనదిలోనే మనము ప్రతినిత్యము ఆరాధన చేయు సాలగ్రామములు లభించును.
మార్గము: నేపాల్ రాజధాని ఖాట్మండుకు 100 కి.మీ.
పా. కలై యుమ్ కరియుమ్ పరిమావుమ్; తిరియుమ్ కానమ్ కడన్దుపోయ్,
శిలై యుమ్ కణై యుమ్ తుణై యాగ; చెన్ఱాన్ వెన్ఱిచ్చెరుక్కళత్తు;
మలై కొణ్డలై నీరణై కట్టి; మదిళ్ నీరిలజ్గై వాళరక్కర్
తలై వన్, తరై పత్తుఱత్తుగన్దాన్; శాళక్కిరామ మడై నె--.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-5-1
మంచిమాట
ఒకనాడు ఒక శ్రీవైష్ణవులు నంబిళ్ల గారిని ఇట్లు అడిగిరి. "కాకాసురుడు పాదములపైబడి శరణువేడినను శ్రీరామచంద్రమూర్తి ఆతని కంటి నొకదానిని పోగొట్టెను గదా! కావున శరణాగతుడైనను పూర్వకర్మను అనుభవించియే తీరవలెనా? "సాధ్య భక్తి స్తు:సాహన్త్రీ ప్త్రారబ్ధస్యాపి భూయసీ" అనునట్లు సాధ్య భక్తి ప్రారబ్ధమును కూడ పోగొట్ట వలదా! అందుకు నంబిళ్లైగారి సమాధానము, "నిజమే, కానీ అంతటి అపరాధియైన కాకాసురుని క్షమించి విడిచిన దానికి గుర్తుగా అట్లు చేరి. అంతేకాదు రెండు కళ్లతో చేయు పనిని ఒక్కకంటితోనే చేయగల ఉపకారమును సైతము చేసిరి కావున అది దండించుటయు కాదు."
134